మహేష్ 26 : ఆ మ్యూజిక్ డైరెక్టరే కావాలి

Sunday,April 28,2019 - 12:02 by Z_CLU

త్వరలో ‘మహర్షి’ తో థియేటర్స్ లోకి రాబోతున్న మహేష్ బాబు నెక్స్ట్ అనిల్ రావి పూడితో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. మహేష్ 26వ సినిమాగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరుగుతోంది. ఇప్పటికే ఆర్టిస్టులతో పాటు టెక్నీషియన్స్ ని కూడా ఫైనల్ చేసేసారు. ప్రస్తుతం షూటింగ్ లోకేషన్స్ సెర్చ్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు అనిల్.

 ఈ సినిమాను నిర్మించనున్న ప్రొడక్షన్ హౌజ్ నుండి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పడింది. ఆ ట్వీటుకి మహేష్ సినిమాకి సంబంధం లేకపోయినా మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ తో కలుగజేసుకున్నారు. అంతే కాదు మహేష్ సినిమాకు అనిరుద్ నే మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకోవాలని రికమండ్ చేసారు. కామెంట్స్ బాక్స్ లో సూపర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ దాదాపు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ పేరునే ట్యాగ్ చేసి కామెంట్ చేసారు. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు.  మరి ఫ్యాన్స్ విన్నపాన్ని మేకర్స్ స్వీకరిస్తారా.. లేదా. చూడాలి.