అదరగొట్టిన రిషి.. మహర్షి టీజర్ రివ్యూ

Saturday,April 06,2019 - 10:07 by Z_CLU

అభిమానులకు ఏం కావాలో, తన బాడీలాంగ్వేజ్ కు ఎలాంటి పాత్రలు సెట్ అవుతాయో మహేష్ కు బాగా తెలుసు. అలా అచ్చుగుద్దినట్టు మహేష్ కోసమే తయారైన సినిమా మహర్షి. పైగా తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన 25వ సినిమా ఇది. అందుకే మహర్షి టీజర్ అంత స్పెషల్ గా ఉంది. ఉగాది కానుకగా ఈ రోజు విడుదలైంది ఈ టీజర్

టీజర్ లో స్టయిలిష్ లుక్ లో అదరగొట్టాడు మహేష్. మరీ ముఖ్యంగా హెలికాప్టర్ నుంచి మహేష్ స్టయిల్ గా దిగి నడిచొచ్చే షాట్ టోటల్ టీజర్ కే హైలైట్. ఇక సక్సెస్ లో ఫుల్ స్టాప్స్ ఉండవంటూ మహేష్ చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. దీంతో పాటు నాకో ప్రాబ్లమ్ ఉంది, ఎవడైనా ఓడిపోతావని అంటే గెలిచి చూపించడం నాకు అలవాటు అంటూ చెప్పిన డైలాగ్ మాస్ ను ఎట్రాక్ట్ చేస్తోంది. దేవిశ్రీప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనీదత్, పీవీపీ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రానుంది మహర్షి.