మరో పని పూర్తిచేసిన మహర్షి

Monday,January 28,2019 - 05:41 by Z_CLU

మహేష్ బాబు మరో షెడ్యూల్ కంప్లీట్ చేశాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న మహర్షి సినిమాకు సంబంధించి పొలాచ్చి షెడ్యూల్ కంప్లీట్ చేశాడు ఈ హీరో. ఓ వారం గ్యాప్ తీసుకొని, వచ్చే నెల నుంచి ఈ సినిమాకు సంబంధించి మరో షెడ్యూల్ ప్రారంభించబోతున్నారు. హైదరాబాద్ లోనే ఆ షెడ్యూల్ ఉంటుంది.

మహేష్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరినరేష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మూవీలో మహేష్ 3 గెటప్స్ లో కనిపించబోతున్నాడనే టాక్ నడుస్తోంది. వీటిలో కాలేజ్ స్టూడెంట్, బిజినెస్ మేన్ గెటప్స్ తో ఇప్పటికే లుక్స్ విడుదల చేశారు. మూడో గెటప్ పై ప్రస్తుతం సస్పెన్స్ నడుస్తోంది.

మహర్షి సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 26న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.