మహర్షి సినిమాపై మరోసారి క్లారిటీ

Wednesday,February 27,2019 - 12:06 by Z_CLU

మహర్షి సినిమాను ఏప్రిల్ 25న విడుదల చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ఓసారి ప్రకటించాడు. కానీ ఆ సినిమా మే లేదా జూన్ కు వాయిదాపడొచ్చంటూ గాసిప్స్ వినిపించాయి. దీంతో యూనిట్ మరోసారి ఎలర్ట్ అయింది. సినిమా విడుదల తేదీని మరోసారి ప్రకటించింది.

ఇంతకుముందే చెప్పినట్టు మహర్షి సినిమా ఏప్రిల్ 25నే రిలీజ్ అవుతుందని యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చింది. మార్చి 15 నాటికి 2 పాటలు మినహా షూటింగ్ కంప్లీట్ అయిపోతుందని, మరోవైపు పోస్ట్-ప్రొడక్షన్ వర్క్ కూడా సైమల్టేనియస్ గా జరుగుతుందని ప్రకటించింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ తో టోటల్ టాకీ పూర్తవుతుంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకుడు. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.