ఓవర్సీస్ లో మహర్షి రికార్డు సృష్టిస్తాడా?

Wednesday,May 08,2019 - 04:43 by Z_CLU

మహర్షి విడుదలవుతోంది. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో, ట్రేడ్ అంతకంటే ఎక్కువగా వెయిట్ చేస్తోంది. దీనికి కారణం రికార్డులు. అవును.. మహర్షి రాకతో పలు రికార్డులు బద్దలవుతాయని ట్రేడ్ అంచనా వేస్తోంది. మరీ ముఖ్యంగా ఓవర్సీస్ లో మహేష్ బద్దలుకొట్టడం కోసం కొన్ని రికార్డులు సిద్ధంగా ఉన్నాయి.

ఓవర్సీస్ లో ఫస్ట్ డే వసూళ్లలో మహేష్ వెనకబడి ఉన్నాడు. ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో ఉన్న బాహుబలి-2ను మినహాయిస్తే.. మిగతా 3 స్థానాల్లో మహేష్ సినిమా ఒక్కటి కూడా లేదు. ఈ టాప్-3 లిస్ట్ లోకి మహర్షి చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

ప్రస్తుతం ఓవర్సీస్ మొదటి రోజు వసూళ్లలో మహేష్ స్థానం 5. అతడు నటించిన స్పైడర్ సినిమా ఆ స్థానంలో కొనసాగుతోంది. సో.. తన సినిమా రికార్డును తాను బద్దలుకొట్టడంతో పాటు వీలైతే మూడోస్థానానికి ఎగబాకాలనేది మహేష్ ప్లాన్.

ఓవర్సీస్ లో బాహుబలి తర్వాత అత్యథిక థియేటర్లలో విడుదలవుతోంది మహర్షి. పైగా అక్కడ మహేష్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. సో.. ఈసారి ఏకంగా బాహుబలి-1 రికార్డునే అతడు క్రాస్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. యూఎస్ లో ఫస్ట్ డే వసూళ్లలో ఆల్ టైమ్ టాప్-10 సినిమాల లిస్ట్ ఇలా ఉంది.

బాహుబలి-2

4.2 మిలియన్ డాలర్లు

అజ్ఞాతవాసి

1.52 మిలియన్ డాలర్లు

బాహుబలి-1

1.36 మిలియన్ డాలర్లు

ఖైదీనంబర్150

1.29 మిలియన్ డాలర్లు

స్పైడర్

1.05 మిలియన్ డాలర్లు

భరత్ అనేనేను

8 లక్షల 50వేల డాలర్లు

అరవింద సమేత

7 లక్షల 97 వేల డాలర్లు

రంగస్థలం

7 లక్షల 6 వేల డాలర్లు

సర్దార్ గబ్బర్ సింగ్

6 లక్షల 16వేల డాలర్లు

జై లవకుశ

5 లక్షల 89 వేల డాలర్లు