నైజాంలో రికార్డు సృష్టించిన మహర్షి

Wednesday,May 15,2019 - 01:47 by Z_CLU

మహేష్ కెరీర్ లోనే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన మహర్షి సినిమా నైజాంలో సరికొత్త రికార్డు సృష్టించింది. నిన్నటి వసూళ్లతో కలుపుకొని ఈ సినిమా నైజాంలో 20 కోట్ల క్లబ్ లో చేరింది. ఫస్ట్ వీకెండ్ వసూళ్లలో నాన్-బాహుబలి రికార్డు క్రియేట్ చేసిన ఈ సినిమా, ఇప్పుడు 20 కోట్ల క్లబ్ లో కూడా చేరడంతో మరో రికార్డు సృష్టించినట్టయింది.

నైజాంలో ఈ సినిమాకు నిన్న కోటి 53 లక్షల రూపాయల షేర్ వచ్చింది. ఈ మొత్తంతో విడుదలైన 6 రోజుల్లో 20 కోట్ల రూపాయల షేర్ సాధించింది మహర్షి. ఫైనల్ రన్ పూర్తయ్యేసరికి ఈ సినిమా నైజాంలో 30 కోట్ల షేర్ సాధిస్తుందని ట్రేడ్ అంచనా వేస్తోంది.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించాడు. కాలేజ్ ఎపిసోడ్ తో పాటు క్లయిమాక్స్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. మరో 2 వారాల పాటు ఈ సినిమా హవా కొనసాగే అవకాశాలున్నాయి.