మహర్షి కూడా పెద్ద సినిమానే

Saturday,May 04,2019 - 04:35 by Z_CLU

సినిమా నిడివి పెరిగితే ఇన్నాళ్లలా మేకర్స్ పెద్దగా భయపడ్డం లేదు. ప్రేక్షకుల నుంచి వ్యతిరేకత వస్తుందేమో అనే అనుమానాలు పెట్టుకోవడం లేదు. ఎందుకంటే అర్జున్ రెడ్డి, మహానటి, రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు ఈ అపోహల్ని తొలిగించాయి. అందుకే మహర్షి యూనిట్ కూడా రన్ టైమ్ పెరిగినా ధీమాగా ఉంది.

ఈ సినిమా తాజాగా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. ఎలాంటి కట్స్ చెప్పకుండా U/A సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ అధికారులు. అన్నీ కలుపుకొని సినిమా నిడివి 2 గంటల 58 నిమిషాలుంది. ఇది కాస్త ఎక్కువ రన్ టైమ్ అయినప్పటికీ ట్రిమ్ చేయడానికి ఇష్టపడలేదట మేకర్స్.

మహర్షి సినిమా మొత్తం ఒకెత్తు, ఆఖరి అరగంట మరో ఎత్తు. చివరి 30 నిమిషాలు ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగంతో కదిలిపోతాడని, కొంతమంది కన్నీళ్లు కూడా పెట్టుకుంటారని ఛాలెంజ్ చేసి మరీ చెబుతున్నారు దర్శకుడు, నిర్మాత. అలాంటి కంటెంట్ ను కట్ చేస్తే, ఎమోషన్ మిస్ అవుతుందనే ఉద్దేశంతో రన్ టైమ్ ఎక్కువైనా అలానే ఉంచేశారట. మూవీ ఫస్టాఫ్ లో కూడా కంటెంట్ కట్ చేయలేని విధంగా ఉందట.