'మహానుభావుడు' ట్రైలర్, ఆడియో రిలీజ్ డీటెయిల్స్

Sunday,September 03,2017 - 10:02 by Z_CLU

శ‌ర్వానంద్ హీరోగా మారుతి ద‌ర్శ‌క‌త్వంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘మహానుభావుడు’ రిలీజ్ కి రెడీ అవుతుంది.. ఇటీవలే టీజర్ తో అందరినీ ఎట్రాక్ట్ చేసి అంచనాలు పెంచిన ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని శ‌ర‌వేగంగా పోస్ట్‌ప్రోడ‌క్ష‌న్ వర్క్ జరుపుకుంటుంది. సోషల్ మీడియా ద్వారా   ఈ వారంలో రెండు సింగిల్స్ ను రిలీజ్ చేయబోతున్న మేకర్స్ త్వరలోనే ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించి మిగతా పాటలతో పాటు థియేట్రికల్ ట్రైలర్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారు.


యు.వి.క్రియోష‌న్స్ బ్యాన‌ర్ పై వంశీ, ప్ర‌మొద్ లు సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇట‌లీ, ఆస్ట్రియా, క్రోయెషియా మ‌రియు పోలాచ్చి తో పాటు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాను విజ‌య‌ద‌శ‌మి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు యూనిట్..