రిలీజ్ కి రెడీ అవుతున్న 'మహానుభావుడు' ....

Monday,September 11,2017 - 03:55 by Z_CLU

శర్వానంద్ హీరోగా మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ‘మహానుభావుడు’ రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాను దసరా కానుకగా సెప్టెంబర్ 29 న రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.

యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాలో శర్వానంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటించగా థమన్ మ్యూజిక్ అందించాడు. ప్రస్తుతం టీజర్, సాంగ్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ అంచనాలు నెలకొల్పుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 29 నుంచి థియేటర్స్ లో సందడి చేయనుంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి ఆ వేడుకలో ట్రైలర్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.