మహానుభావుడు ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయింది

Wednesday,September 13,2017 - 05:11 by Z_CLU

శర్వానంద్ మహానుభావుడు ఆడియో రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఇప్పటికే రిలీజయిన 2 సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ని ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయ్యాయి. S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన మొత్తం పాటలను సెప్టెంబర్ 16 న గ్రాండ్ గా రిలీజ్ చేయనుంది మహానుభావుడు టీమ్.

మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ సరసన మెహరీన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. UV క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాను వంశీ, ప్రమోద్ లు సంయుక్తంగా నిర్మించారు. మారుతి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.