కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా సర్ ప్రైజ్ చేసిన మహానటి టీమ్

Tuesday,October 17,2017 - 02:09 by Z_CLU

మహానటి సావిత్రి బయోపిక్ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. కీర్తి సురేష్ ఈ సినిమాలో ‘సావిత్రి’ రోల్ ప్లే చేస్తుంది. అయితే కీర్తి సురేష్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా పోస్టర్ రివీల్ చేసింది సినిమా యూనిట్. సినిమా లాంచ్ అయినప్పటి నుండే ఇంటరెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, కేవలం  కళ్ళను  మాత్రమే  రివీల్ చేస్తూ,  ‘ ఆకాశ  వీధిలో  అందాల  జాబిలి’  అనే  లైన్ తో  రిలీజ్ అయిన ఈ  పోస్టర్ తో సోషల్ మీడియాలో పాజిటివ్ స్పేస్ ని క్రియేట్ చేసుకుంటుంది.

నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాడు.  వైజయంతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతుంది.