మహానటి ప్రొడ్యూసర్స్ - ప్రియాంక దత్, స్వప్న దత్ ఇంటర్వ్యూ

Saturday,May 05,2018 - 02:02 by Z_CLU

మే 9 న గ్రాండ్ గా రిలీజవుతుంది ‘మహానటి’ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ బజ్ క్రియేట్ చేస్తుంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ ప్రియాంక దత్, స్వప్నదత్ ఈ సినిమా గురించి మీడియాతో మాట్లాడారు. అవి మీకోసం…

చాలా పెద్ద బాధ్యత…

ఈ సినిమా చేయాలనుకోవడం నిజంగా చాలా పెద్ద బాధ్యత. అందుకే రెగ్యులర్ సినిమాలతో కంపేర్ చేస్తే ఈ సినిమాకి చాలా ఫోకస్డ్ గా, డీటేల్డ్ గా పని చేశాం.

అదృష్టంగా ఫీల్ అవుతున్నాం…

సావిత్రి గారిని ఇష్టపడని వాళ్ళంటూ ఎవరూ ఉండరేమో… అందుకే ఎప్పుడైతే ఈ ఐడియా వచ్చిందో ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేశాం, ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు…

 

మాకు కావాల్సిందదే….

రిస్క్ అనేది ప్రతి బిజినెస్ లో ఉంటుంది… సినిమా అనేది ప్యాషన్ తో కూడుకున్నది… జస్ట్ డబ్బుకోసమే చేస్తే ఏదీ సాధించలేం, ప్యాషన్ తో చేసినపుడే డబ్బు వస్తుంది, సక్సెస్ వస్తుంది… సినిమాని మా కరియర్ గా చూజ్ చేసుకున్నందుకు ఒక 4 బెస్ట్ సినిమాలు చేయగలిగినా చాలు…

అలా జరిగింది…

నాగ్ అశ్విన్ ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కన్నా ముందే ఈ బయోపిక్ ఫిక్స్ అయి ఉన్నాడు. ఆ సినిమా తర్వాత ఎప్పుడైతే ఈ సినిమా గురించి ఆలోచించడం బిగిన్ చేశామో, నాగ్ అశ్విన్ చాలా మందిని కలిశాడు, చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాడు, అ తరవాత ఫ్యామిలీని కలిశాడు.

అది వాళ్ళ రియాక్షన్…

అసలీ బయోపిక్ గురించి చెప్తే సావిత్రి గారి ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అవుతారోనన్న భయం ఉండేది. చాముండి గారికి ఎప్పుడైతే నాగ్ అశ్విన్ తన విజన్ ఎక్స్ ప్లేన్ చేశాడో, ‘మా అమ్మ సేఫ్ హ్యాండ్స్ లో ఉంది..’ అన్నారు. ఇక హ్యాప్పీ…

 

ఆ సినిమా కూడా అప్పుడే…

మే లో రిలీజ్ అనుకున్నాం… ఆ తర్వాత ఏ వీక్ లో రిలీజ్ చేద్దాం అని డిస్కస్ చేసుకుంటున్నప్పుడు, డాడీ అన్నారు 23 ఇయర్స్ బ్యాక్ జగదేక వీరుడు – అతిలోక సుందరి మే 9 న రిలీజ్ చేశాం, ఈ సినిమా కూడా అలాగే చేయండి అన్నారు.. అలా ఫిక్సయ్యాం…

అందుకే నో అని చెప్పింది…

కీర్తి సురేష్ ని మేం ఫిక్సవ్వడానికే నెల రోజుల టైమ్ పట్టింది. మేము అనుకుంటూనే ఉన్నాం అంతలో నాని, కీర్తి సురేష్ కి చెప్పాడు.  కీర్తి ఎగ్జైటెడ్ గా ఉన్నా, చాలా భయపడింది. చేయగలనో లేదో.. ఇంత పెద్ద రెస్పాన్సిబిలిటీ అని…   తరవాత చిన్నగా కన్విన్స్ అయింది. అందరూ కీర్తి సురేష్ రైట్ చాయిస్ అంటూంటే చాలా హ్యాప్పీగా ఉంది.

చాలా రీసర్చ్ చేశాం…

లుక్ విషయంలో చాలా కేర్ తీసుకున్నాం. సినిమాలో కీర్తిని కాదు… సావిత్రి గారిని చూపించాలి. ఆ ఒక్కటి పర్ఫెక్ట్ గా చేయగలిగితే సగం సక్సెస్ అయినట్టే. అందుకే సావిత్రి గారి చాలా వీడియోస్ చూశాం. అలాంటివే ఆక్సెసరీస్ డిజైన్ చేయించాం… కాస్ట్యూమ్స్ విషయంలో కూడా అంతే కేర్ తీసుకున్నాం…

 

సమంతానే ఫస్ట్…

సావిత్రి గారి క్యారెక్టర్ కి కీర్తిని ఇంకా ఫైనలైజ్ కూడా చేయలేదు,  నాగ్ అశ్విన్ సమంతని అప్రోచ్ అయ్యాడు. 10 నిమిషాల్లో తను ఓకె చెప్పేసింది. తనది లీడ్ రోల్ కాకపోయినా, ఇంత గొప్ప సినిమాలో చిన్న రోల్ అయినా తను ఉండాలి అనుకుంది. చాలా బాగా చేసింది…

మంచి సినిమాలే చేయాలి…

నన్నాగారితో ఉంటూ చాలా ఫిల్మ్ మేకింగ్ వ్యాల్యూస్ నేర్చుకున్నాం. అప్పటి వాళ్ళు చేసినంతగా ఇప్పుడు చేస్తే చాలా బావుంటుంది. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’  తరవాత ఇమ్మీడియట్ గా సినిమా చేయండి అని చాలా మంది  అన్నారు, కానీ స్టోరీ నచ్చాలి.. అప్పుడే చేయాలి. అందుకే ఇంత టైమ్ పట్టింది. మంచి సినిమాలు చేయాలని ఉంది…

 

సినిమాటోగ్రాఫర్ డ్యానీ..

మ అసిస్టెంట్ డైరెక్టర్ ఒక వీడియో చూసి డ్యానీ ని రిఫర్ చేసింది. లక్కీగా మాకు తన కాంటాక్ట్ దొరకినది. మేమనుకోగానే డ్యానీకి 6 మంత్స్ ఇండియా వీసా దొరకడం, ఈ సినిమాకు పని చేయడం జరిగింది…

మిక్కీ మ్యూజిక్ అద్భుతం…

మికీ మ్యూజిక్ తో సినిమాకు ప్రాణం చేశాడు. BGM కూడా చాలా బాగా చేశాడు.

తోట తరణి గారు హెల్ప్ చేశారు…

ప్రతి చిన్న విషయంలో కేర్ తీసుకున్నాం. బ్యాక్ గ్రౌండ్స్ దగ్గరి నుండి, కాఫీ కప్స్, చివరకి పెన్ కూడా, ఎక్కడెక్కడ ఆంటిక్ థింగ్స్ దొరికితే అక్కడికి ట్రావెల్ చేశాం. తోట తరణి గారు ఈ విషయంలో చాలా హెల్ప్ చేశారు.