మహానటి ఫస్ట్ డే టాక్

Wednesday,May 09,2018 - 10:43 by Z_CLU

అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. సావిత్రి నిజజీవితంతో పాటు, ఆమె వెండితెర వైభవాన్ని ఈతరం ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు నాగ్ అశ్విన్. భారీ స్టార్ కాస్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఓవర్సీస్ లో 150కి పైగా లొకేషన్లలో విడుదలైన మహానటి సినిమాకు కంప్లీట్ పాజిటివ్ టాక్ వచ్చింది. సినిమాను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు ఓవర్సీస్ ఆడియన్స్. సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తిసురేష్ ను ప్రత్యేకంగా మెచ్చుకుంటున్నారు. ఫిక్షన్ కు పోకుండా సావిత్రి జీవితాన్ని ఉన్నది ఉన్నట్టు చూపించడం ఓవర్సీస్ ఆడియన్స్ కు బాగా నచ్చింది.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఇక్కడ కూడా మహానటి అందరికీ తెగ నచ్చేసింది. సెకెండాఫ్ లో మనసును కదిలించే సన్నివేశాలకు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఇక క్లయిమాక్స్ లో సమంత యాక్టింగ్ కు ఆడియన్స్ అంతా ఫిదా అవుతున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్లపై తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజేంద్రప్రసాద్, మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, షాలినీ పాండే తదితరులు నటించారు.