‘మహానటి’ లో గుమ్మడి మిస్సయ్యారు

Wednesday,May 16,2018 - 03:10 by Z_CLU

రిలీజై వారం గడుస్తున్నా టాలీవుడ్ లో మహానటి క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మహానటి సావిత్రిని మహా మనిషిగా ఎలివేట్ చేస్తుందని అభిప్రాయపడుతున్నారు సినిమా చూసిన వాళ్ళంతా. దాంతో పాటు ఈ సినిమాలో ఒక ఇమోషనల్ సీన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్ పాయింట్ లా మారింది.

సినిమా సెకండాఫ్ లో ఒకచోట సావిత్రికి, ఎస్వీ రంగారావు భోజనం పెట్టే సీన్ ఉంది. నిజానికది ‘గోరింటాకు’ సినిమా టైమ్ లో జరిగిన ఇన్సిడెంట్ . అప్పటికి SVR  చనిపోయారు. అలాంటప్పుడు SVR  సావిత్రికి భోజనం పెట్టడమేంటనే డౌట్ చాలా మందికి వచ్చింది. దానికి దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.

“నిజానికి ‘గోరింటాకు’ సినిమా టైమ్ లో సావిత్రికి భోజనం పెట్టింది గుమ్మడి గారు. ఇంత అద్భుతమైన సన్నివేశాన్ని సినిమాలో ఎలాగైనా పెట్టాలనుకున్నాను. కానీ జస్ట్ ఈ ఒక్క సీన్ కోసం గుమ్మడి క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేసి, న్యాయం చేయలేనేమో అనుకుని  ఆల్రెడీ మోహన్ బాబు ప్లే చేస్తున్న SVR పాత్రతో ఆ సీన్ చేయించాను.”