మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇంటర్వ్యూ

Monday,May 07,2018 - 06:32 by Z_CLU

సీనియర్ నటి సావిత్రి బయోపిక్ ఈనెల 9న రిలీజవుతుంది. ఎంత తెలిసిన కథే అయినా, ఆ కథని సిల్వర్ స్క్రీన్ పై ఎలా ప్రజెంట్ చేశారనే ఆసక్తి ప్రతి ఒకరిలోను ఉంది. సావిత్రి రియల్ లైఫ్ తో పాటు రీల్ లైఫ్ లోని ఇంట్రెస్టింగ్ ఫేజ్ ని ఇమోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించిన దర్శకుడు నాగ్ అశ్విన్, ఈ సినిమా గురించి మరిన్ని వివరాల్ని మనతో షేర్ చేసుకున్నాడు. 

 

ఆలోచన ఎప్పటిదో…

సావిత్రి గారి బయోపిక్ చేయాలన్న ఆలోచన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ కన్నా ముందు నుండే ఉంది. కానీ దానికి ఇప్పుడు టైమ్ వచ్చింది. అప్పటి వరకు నాకు సావిత్రి గారంటే గొప్ప నటి అనే ఫీలింగ్ ఉండేది. కానీ ఈ బయోపిక్ కోసం ఎప్పుడైతే రీసెర్చ్ చేయడం మొదలుపెట్టానో, ఆవిడ గురించి చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాను.

ప్యారలల్ గా బ్యాలన్స్ చేసుకున్నాం…                         

మద్రాస్ కి వెళ్లి ఫస్ట్ మూవీ కోసం ట్రై చేసినప్పుడు LV ప్రసాద్ గారిని కలుసుకున్న దగ్గరి నుండి, ANR గారిని ‘బాలరాజు’ షూటింగ్ టైమ్ లో బెజవాడలో కలిసినప్పుడు లాంటి సీక్వెన్సెస్ అన్నీ చాలా వరకు అల్లుకుంటూ వెళ్లాం…

అందుకే కీర్తి బెస్ట్ అనిపించింది…

చాలా రోజుల నుండి ‘సావిత్రి’ రోల్ ఎవరా అని చూస్తున్నా… ఎస్టాబ్లిష్ స్టార్స్ దగ్గరి నుండి న్యూ కమర్ వరకు చాలా మందిని చూశా… అంతలో తమిళ సినిమా ‘తొడరి’ లో కీర్తిని చూసినప్పుడు పర్ఫెక్ట్ అనిపించింది. యంగ్ సావిత్రి నుండి 40 ఏళ్ల ఏజ్ గ్రూప్ వరకు కీర్తిని ప్రెజెంట్ చేయొచ్చు. అంత స్కోప్ ఉన్న ఆర్టిస్ట్ కీర్తి అనిపించింది. అందుకే ఫిక్సయ్యాం…

ఈ ప్రాసెస్ లో నేను ఎదిగాను…

అందరి చేత అమ్మా.. అని పిలిపించుకునే స్థాయి సావిత్రి గారిది. అలాంటి నటి బయోపిక్ అంటే సాహసమే. ఆవిడ గురించి తెలుసుకుని ఇంత రెస్పాన్సిబిలిటీని పూర్తిచేసే ప్రాసెస్ లో నాకు నేను ఎదిగాను…

ఎవరినీ సంప్రదించలేదు…

చాలా మటుకు ఇన్ఫర్మేషన్ మాకు పుస్తకాల్లో, సావిత్రి కుటుంబసభ్యుల దగ్గరే దొరికింది. V.K. మూర్తి, సోమరాజు లాంటి రైటర్స్ సావిత్రి గారి గురించి ఆ రోజుల్లోనే చాలా రీసర్చ్ చేసి రాశారు. మనకు తెలియని చాలా విషయాలు అందులో ఉన్నాయి. అందుకే మాకు ఎక్కడా ఏదీ మిస్ అయిన ఫీలింగ్ రాలేదు. ఏదైనా మిస్సింగ్ అనిపిస్తే మేము ఎవరినైనా సంప్రదించి ఉండేవాళ్ళమేమో..

సావిత్రి గురించే…

మోహన్ బాబు గారు కానీ నాగచైతన్య, సమంతా ఈ సినిమాలో పార్ట్ అయ్యారంటే అది జస్ట్ సావిత్రి కోసమే. అదే వేరే సినిమా అయితే డెఫ్ఫినేట్ గా ఆలోచించి ఉండేవాళ్ళు. అంత గొప్పనటి బయోపిక్ లో నటించే అవకాశం అంటే అదృష్టమే కదా…

అనవసరమనిపించింది…

టీజర్ లో కీర్తిని సావిత్రి లా ప్రెజెంట్ చేయడం హై పాయింట్. కొన్ని బ్లాక్ & వైట్ షాట్స్ హై పాయింట్.. స్టోరీ కొత్తదైనప్పుడు క్యూరాసిటీ జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, ఈ బయోపిక్ కు టీజర్ తరవాత ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. అందుకే మా సినిమాకు ట్రైలర్ లేదు.

ఫ్రెండ్లీ కాస్టింగ్…

సినిమాలో ఎంత స్టార్ కాస్ట్ ఉన్నా ఇబ్బంది పడలేదు. అందరినీ ఒకేసారి సెట్స్ పైకి తీసుకురావడం కొంచెం కష్టమేమో.. కానీ వర్క్ విషయానికి వస్తే అందరూ చాలా సీరియస్ అండ్ సిన్సియర్ కాబట్టి అసలు ప్రాబ్లమే అనిపించలేదు…

రియలిస్టిక్ గా చేశాను…

సినిమాలో ప్రతి సీన్ రియలిస్టిక్ గా ఉంటుంది. ఎక్కడో ఒకటి, రెండు చోట్ల కొంచెం కామెడీ కోసం.. అది కూడా రియలిస్టిక్ ఎలిమెంట్స్ నుండే ప్లాన్ చేసుకున్నాను…

తెలిసిన స్టోరీ అయినా…

ఇది తెలిసిన స్టోరీ అయినా, సావిత్రిగారి ఫ్రెండ్ సుశీల గారు, ఆవిడ కరియర్.. అన్నీ అందరికీ తెలీదు. సావిత్రి గారి కూతురు, అబ్బాయి కొన్ని విషయాలు చెప్పారు. సావిత్రి గారు హాలీడేస్ లో ఎలా గడిపేవారు లాంటి విషయాలు చాలా మందికి తెలీదు…

డైరెక్టర్స్…

సినిమాల్లో క్రిష్ K.V. రెడ్డిలా కనిపిస్తాడు. L.V. ప్రసాద్ లా అవసరాల శ్రీనివాస్ కనిపిస్తాడు. తరుణ్ భాస్కర్… సింగీతం శ్రీనివాస్ గారి రోల్స్ లో చాలా బాగా చేశారు.

మోహన్ బాబు గారు…

S.V.R. ఎపిసోడ్ మాయాబజార్ సినిమా టైమ్ లో ఉంటుంది. SVR స్టైల్ లోనే ఉంటారు మోహన్ బాబు గారు… చాలా బాగా చేశారు.