మహానటి 2 వారాల వసూళ్లు

Saturday,May 26,2018 - 12:30 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ అయిన మహానటి సినిమా సక్సెస్ ఫుల్ గా 2 వారాల రన్ పూర్తిచేసుకుంది. బ్లాక్ బస్టర్ టాక్ తో 3వ వారంలోకి ఎంటరైన ఈ సినిమాకు 14 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల 60 లక్షల రూపాయల షేర్ వచ్చింది.

అటు ఓవర్సీస్ లో ఈ సినిమా రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. అత్యధిక వసూళ్లు సాధించిన ఆల్ టైం తెలుగు మూవీస్ లిస్ట్ లో 8వ స్థానం పొందింది. థియేటర్ల పెంపు కారణంగా త్వరలోనే 7 లేదా 6వ స్థానానికి ఎగబాకే ఛాన్స్ ఉంది.

ఏపీ, నైజాం 14 రోజుల షేర్
నైజాం – రూ. 8.63 కోట్లు
సీడెడ్ –  రూ. 2.05 కోట్లు
నెల్లూరు – రూ. 0.52 కోట్లు
గుంటూరు – రూ. 1.50 కోట్లు
కృష్ణా – రూ. 1.74 కోట్లు
వెస్ట్ – రూ. 1.05 కోట్లు
ఈస్ట్ – రూ. 1.51 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.60 కోట్లు

2 వారాల మొత్తం షేర్ – రూ. 19.60 కోట్లు