రేపే గ్రాండ్ గా రిలీజవుతోంది ‘ABCD’. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి బిజీగా ఉన్నప్పటికీ ‘జీ సినిమాలు’తో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడారు. మరి ABCD గురించి మధుర శ్రీధర్ చెప్పిన విశేషాలు ఆయన మాటల్లోనే…
కొన్ని సార్లు చెప్పాల్సిందే
సినిమా కథేంటో టైటిల్ లోనే చెప్పేసాం. కొన్ని సార్లు ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీస్ కి టైటిల్ లోనో, టీజర్ లేదా ట్రైలర్ లో అయినా కథ చెప్పాలి. ప్రేక్షకులకు అందుకే ఏం చూడబోతున్నారో ముందే చెప్పేసాం.
సింపుల్ అండ్ స్వీట్
‘ABCD’సినిమా సింపుల్ లైన్ తో తెరకెక్కిన స్వీట్ ఫిలిం. ఒక హీరో క్యారెక్టర్ చేంజ్ అవ్వడం అనేది సింపుల్ ఫార్ములా దాన్ని స్వీట్ గా చూపించే ప్రయత్నం చేసాం. మళయాళంలో హిట్ సినిమాలోని సోల్ తీసుకొని ఈ సినిమాను మన నేటివిటీకి తగ్గట్లుగా మార్పులు చేసి చేశాం. ఒరిజినల్ లో చాలా లెంగ్తీ గా ఉంటుంది.
ఫెంటాస్టిక్ జాబ్
సినిమాకు ఫ్రెష్ మ్యూజిక్ ఉంటే బాగుంటుందని ఫీలయ్యాం. అందుకే ఒరిజినల్ ట్యూన్స్ వాడలేదు. మేం అనుకున్నట్లే జూడా సాందీ బెస్ట్ సాంగ్స్ ఇచ్చాడు. హి డిడ్ ఫెంటాస్టిక్జాబ్. శ్రవణ్ భరద్వాజ్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి హైలైట్ అవుతుంది.
పొలిటికల్ టచ్ ఉంటుంది… కానీ
సినిమా టీజర్ , ట్రైలర్ లో ఉన్న పొలిటికల్ టచ్ చూసి ఇది కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ సినిమా అనిపించొచ్చు కానీ.. అసలు కథే వేరు. క్లైమాక్స్ లో హీరో రియలైజ్ అయ్యే పాయింట్ కోసం మాత్రమే ఆ సన్నివేశాలు తీశాం.
యూత్ ఫుల్ , ఫ్యామిలీ ఎంటర్టైనర్
ఈ సమ్మర్ లో అందరూ చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది. యూత్ ఫుల్ ఎలెమెంట్స్ తో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంటుంది. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకూ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు.
అన్ని ఎలిమెంట్స్ తో
సినిమాలో ఎమోషన్, ఫన్ , లవ్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. బంచ్ ఆఫ్ ఎంటర్టైన్ మెంట్ అన్నమాట. డెఫినెట్ గా అన్ని ఎమోషన్స్ హైలైట్ అవుతాయి.
సేఫ్ ప్రాజెక్ట్ అని….
సంజీవ్ ‘లేడీస్ అండ్ జెంటిల్ మెన్’ సినిమాకు కథ అందించాడు. అప్పటి నుండి మా ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత సంజీవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ‘ఓం మంగళం..మంగళం’ అనే సినిమా నిర్మించాలని అనుకున్నా. కానే అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సినిమా గురించి వినగానే సంజీవ్ కి ఇదే సేఫ్ ఫిలిం అనిపించింది. ఒక డెబ్యూ డైరెక్టర్ కి రీమేక్ అనేది ఛాలెంజింగ్ అనిపించినా చాలా వరకూ సేఫ్ ప్రాజెక్ట్ అవుతుంది. అందుకే సంజీవ్ కి ఈ చాన్స్ ఇవ్వడం జరిగింది.
శిరీష్ కి పెర్ఫెక్ట్ ఫిలిం
అల్లు శిరీష్ యంగ్ అండ్ ఎనర్జిటిక్. ఏదో చేయాలి… పరిశ్రమలో మనం కూడా హీరోగా నిరూపించుకోవాలని తపన పడుతుంటాడు. ‘ABCD’శిరీష్ కి పర్ఫెక్ట్ ఫిలిం. సినిమాలో శిరీష్ కనిపించడు ఒక డబ్బున్న కుర్రాడు పడే అవస్తలే కనిపిస్తాయి. అంత బాగా పెర్ఫాం చేసాడు. కచ్చితంగా వచ్చే రెండు మూడేళ్ళలో శిరీష్ హీరోగా మనల్ని సప్రైజ్ చేస్తాడు. అది మాత్రం చెప్పగలను.
భరత్ సర్ ప్రైజ్ చేస్తాడు
కొంత గ్యాప్ తర్వాత భరత్ మళ్ళీ ఈ సినిమాతో పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేయబోతున్నాడు. తన పెర్ఫార్మెన్స్ తో కచ్చితంగా ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేస్తాడు. సినిమాలో భరత్ హీరోతో పాటు ఉండే ఫుల్లెంత్ క్యారెక్టర్ లో కనిపిస్తాడు. అలాగే వెన్నెల కిశోర్ కామెడీ కూడా సినిమాకి మరో హైలైట్ కానుంది.
ఆయనే నా బలం
సురేష్ బాబు గారు ఎప్పుడూ నన్ను నమ్ముతారు. ఎక్కడో ఆయన అభిరుచి నా అభిరుచి కలిసింది. మా ఇద్దరికీ మంచి అండర్ స్టాండింగ్ ఉంది. అందుకే ఆయనతో కలిసి ట్రావెల్ అవుతున్నా. ఈ సినిమాకి ఎప్పటిలాగే ఆయన బెస్ట్ సపోర్ట్ ఇచ్చారు. ఆయనకి ప్రత్యేక కృతజ్ఞతలు.
సినిమా పట్ల అమితమైన ప్రేమ
నిర్మాత యష్ జెంటిల్ మెన్. సినిమా పట్ల అమితమైన ప్రేమతో మంచి అవగాహణ ఉన్న వ్యక్తి. ఆయనతో కలిసి ఈ సినిమాను నిర్మించడం హ్యాపీ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇంకా చాలా సినిమాలు వస్తాయి. అందులో ‘దొరసాని’ ఒకటి. అలాగే ధీరజ్ కూడా బెస్ట్ సపోర్ట్ అందించాడు. ధీరజ్ ని ఎగ్జిక్యూట్ ప్రొడ్యూసర్ అని కాకుండా యంగ్ లీడర్ అని అంటుంటాను.
కారణాలు రెండు …
డైరెక్షన్ అనేది చాలా కష్టం. మూడు సినిమాలను డైరెక్ట్ చేయడం ద్వారా అన్ని క్రాఫ్ట్స్ గురించి డీటైల్ గా తెలుసుకోగలిగాను. ఆ అనుభవంతోనే నిర్మాతగా మారి సినిమాలు నిర్మిస్తున్నాను. ఇక డైరెక్షన్ కి బ్రేక్ ఇవ్వడానికి రెండు కారణాలు.. అందులో ఒకటి నేను డైరెక్ట్ చేసిన ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ సక్సెస్ కాకపోవడం, రెండోది అన్ని కథలు నేను చెప్పాలి అనుకోకుండా కొత్త వారికి కూడా నా సంస్థ ద్వారా అవకాశం అందించాలన్న ఉద్దేశ్యం.
ఒక మంచి కాన్సెప్ట్ తో ….
త్వరలోనే ఓ సినిమా డైరెక్ట్ చేసే ఆలోచన ఉంది. అందుకు ఒక మంచి కాన్సెప్ట్ రెడీ చేసుకున్నాను. కానీ ఇంకాస్త టైం పడుతుంది. త్వరలోనే ఆ సినిమా వివరాలు ప్రకటిస్తా.
బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తో ‘దొరసాని’
‘దొరసాని’ సినిమాకు సంబంధించి షూట్ ఫినిష్ అయింది. ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో తెరకెక్కుతున్న సినిమా. ఆ సినిమా ద్వారా విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ అలాగే రాజశేఖర్ గారి కూతురు శివాత్మిక హీరో హీరోయిన్స్ గా పరిచయం అవుతున్నారు. జులై 5 న రిలీజ్ చేయబోతున్నాం. ఆ సినిమా ద్వారా మహేందర్ దర్శకుడిగా పరిచయం కానున్నాడు.