మాధవన్ ప్రమోషన్...

Saturday,October 08,2016 - 06:42 by Z_CLU

కార్తీ నటించిన ‘కాష్మోరా’ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. ఈ మధ్య ఫంక్షన్స్ కి పెద్దగా హాజరు కానీ మాధవన్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరయ్యాడు .

 అయితే తన స్నేహితుడు సూర్య…..కార్తీ నటించిన ‘కాష్మోరా’ పోస్టర్ చూపించాడని….. అప్పుడే ఈ సినిమాను ప్రమోట్ చెయ్యాలని అనిపించిందని మాధవన్ తెలిపాడు. కార్తీ  చాలా  మంచి నటుడు. మూడేళ్లు ఓ సినిమా కోసం కృషి చెయ్యడం అభినందించాల్సిన విషయం అని, ఈ సినిమా ఖచ్చితంగా గ్రాండ్ హిట్ సాధిస్తుందన్నాడు మాధవన్.

siv_26010112

     ఇక సూర్య-మాధవన్ ఫ్రెండ్షిప్ గురించి కార్తీ కూడా చెప్పుకొచ్చాడు. తన అన్నయ్య-మాధవన్ చాలా మంచి మిత్రులని, ఎప్పుడు కలుస్తూనే ఉంటారని… తమ సినిమాల గురించి చాలా సేపు మాట్లాడుకుంటారని… ఈరోజు తన ఆడియో వేడుకకి అన్నయ్యలా వచ్చి ప్రమోట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నాడు. మరి ఇలా తనఫ్రెండ్ తమ్ముడు కోసం చాలా రోజుల తరువాత తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు ‘సఖి’ హీరో. ఈమధ్యే సాలా ఖదూస్ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నాడు మాధవన్.