బాగా కుదిరింది..

Thursday,September 22,2016 - 09:00 by Z_CLU

టాలీవుడ్ లో కొందరు దర్శకులు తమకు సూపర్ హిట్ సాంగ్స్ ను అందించి తొలి విజయానికి కారణమైన సంగీత దర్శకుడికే ఛాన్స్ ఇస్తూ వారి నుండి వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ అందుకుంటున్నారు..ఓ సారి ఇద్దరి కాంబినేషన్ లో ఓ సూపర్ హిట్ ఆల్బమ్ వస్తే ఇక వీరిద్దరూ కలిసి పని చేసే మరో సినిమా పై ప్రేక్షకుల్లో అంచనాలు , మార్కెట్ లో ఆసక్తి నెలకొనడం తో మళ్ళీ మళ్ళీ అదే కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నారు. అలా మొదటి సినిమా నుండి ఒకే సంగీత దర్శకుడి తో పని చేస్తూ సూపర్ హిట్ ఆల్బమ్స్ అందుకుంటూ ముందుకెళ్తున్న ఆ దర్శకులెవరో చూద్దాం.

rajamouli-keeravani-still
రాజమౌళి-కీరవాణి
టాలీవుడ్ లో ఇలా మ్యూజిక్ రిపీట్ కాంబినేషన్ గురించి మాట్లాడుకోవాలంటే ముందుంటారు. రాజమౌళి-కీరవాణి. రాజమౌళి తన మొదటి చిత్రం ‘స్టూడెంట్ నెం1’ నుండి ప్రస్తుతం రూపొందిస్తున్న ‘బాహుబలి వరకూ కీరవాణి బాణీలనే అందుకుంటూ ఆయననే రిపీట్ చేస్తున్నాడు. ఈ రిపీట్ కి వీరిద్దరూ అన్న దమ్ములే కావడం ఒక కారణమైతే. తన అనుభవం తో సంగీతం, ఆర్.ఆర్ తో రాజమౌళి సినిమాలను మరో ఎత్తుకు తీసుకెళ్లడం మరో కారణమనే చెప్పొచ్చు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ రాజమౌళి తో పనిచేయాలని కోరుకుంటున్నా జక్కన్న మాత్రం సంగీతం లో కీరవాణి కి తప్ప మరొకరికి ఇప్పటి వరకూ ఛాన్స్ ఇవ్వలేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే కీరవాణి లేకపోతే రాజమౌళి సినిమా చెయ్యలేడు అనే కామెంట్స్ కూడా టాలీవుడ్ లో అప్పుడప్పుడు వినిపిస్తుంటాయి.

sukumar-dsp

సుకుమార్-దేవి శ్రీ ప్రసాద్
ఆర్య నుండి ప్రారంభమైన వీరిద్దరి కాంబినేషన్ తొలి ఆల్బమ్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ పాటలు ఇప్పటికీ యువత గుండెల్లో పదిలం. అందుకేనేమో చేసే ప్రతి సినిమాకు దేవి కె అవకాశం ఇస్తూ వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ అందుకుంటూ దూసుకెళ్తున్నాడు సుకుమార్. ‘ఆర్య’ నుండి ‘నాన్నకు ప్రేమతో’ వరకూ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అన్ని పాటలు సూపర్ హిట్టే. అందుకే తాను దర్శకత్వం వహించే సినిమాకే కాక నిర్మించిన కుమారి 21 ఎఫ్ సినిమాకు కూడా దేవి నే సంగీతం అందించమని కోరాడు సుక్కు. త్వరలోనే రామ్ చరణ్ తో సుకుమార్ తెరకెక్కించనున్న చిత్రానికి కూడా దేవి ఏ మ్యూజిక్ డైరెక్టర్.

koratala-siva-dsp

కొరటాల శివ-దేవి శ్రీ ప్రసాద్
ప్రస్తుతం వీరిద్దరిది టాలీవుడ్ లో మూడు బ్లాక్ బస్టర్స్ అందుకున్న బ్లాక్ బస్టర్ కాంబినేషన్. రచయిత నుండి దర్శకుడి గా వేసిన తొలి అడుగు ‘మిర్చి’ తో కొరటాల శివ దేవి శ్రీ సంగీతానికి మంత్ర ముగ్ధుడై పోయాడు. తొలి సినిమా సక్సెస్ లో దేవి తన దైన పాత్ర పోషించాడని నమ్మిన కొరటాల రెండో సినిమా ‘శ్రీమంతుడు’ కి కూడా దేవి కె ఛాన్స్ ఇచ్చాడు. అంతే ఇక కొరటాల నమ్మకాన్ని మరో మారు నిజం చేసి శ్రీమంతుడు విజయం లో కూడా మంచి పాత్ర పోషించాడు దేవి. ఇక అందుకే ముచ్చటగా మూడో సారి ‘జనతా గ్యారేజ్’ తో దేవి కి సంగీత దర్శకుడిగా మరో అవకాశం ఇచ్చాడు శివ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ ఆల్బమ్ కూడా సూపర్ హిట్ కావడం తో మహేష్ బాబు తో త్వరలో రెండో సినిమాకు సిద్దమవుతున్న కొరటాల మళ్ళీ దేవి కె ఛాన్స్ ఇవ్వబోతున్నాడని టాక్ వినిపిస్తుంది.

sreekanth-addala-mikky

శ్రీకాంత్ అడ్డాల-మిక్కీ జె.మేయర్
ఈ లిస్ట్ లో తమ మ్యూజిక్ కాంబినేషన్ తో నాలుగో స్తానం లో ఉన్నారు. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల-మిక్కీ జె.మేయర్. దర్శకుడిగా మొదటి సినిమా ‘కొత్త బంగారు లోకం’ తో మిక్కీ కి ఛాన్స్ ఇచ్చిన శ్రీకాంత్ అడ్డాల ఆ సినిమాకి మిక్కీ సూపర్ హిట్ ఆల్బమ్ ఇవ్వడం తో అప్పటి నుండి తాను చేసే ప్రతి సినిమాకు మిక్కీ నే ఎంచుకుంటూ వరుస సూపర్ హిట్ ఆల్బమ్స్ అందుకుంటున్నాడు అడ్డాల. చేసిన నాలుగు సినిమాలకు మిక్కీ కె అవకాశం ఇచ్చి టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లిస్ట్ లో నిలబెట్టిన ఈ దర్శకుడు ఇక ముందు చేయబోయే సినిమాలకు కూడా సంగీత దర్శకుడిగా మిక్కీ కె ఛాన్స్ ఇవ్వడం ఖాయం.

vijay-anup
విజయ్ కుమార్ కొండ- అనూప్ రూబెన్స్
ఈ లిస్ట్ లో ఐదో స్థానం లో ఉన్నారు దర్శకుడు విజయ్ కుమార్ కొండ-సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్. ‘గుండె జారి గల్లతయ్యిందే’ సినిమాతో ప్రారంభమైన వీరిద్దరి కాంబినేషన్ ‘ఒక లైలా కోసం’ సినిమాతో మరో సారి రిపీట్ అయ్యింది. తొలి సినిమాకు అలరించే ఆల్బమ్ ఇవ్వడం తో రెండో సారి కూడా అనూప్ కె మ్యూజిక్ డైరెక్టర్ గా ఛాన్స్ ఇచ్చాడు విజయ్. త్వరలోనే మెగా హీరో తో మూడు సినిమాకు సిద్దమవుతున్న ఈ దర్శకుడు ఈ సినిమాకు కూడా అనూప్ నే ఎంచుకున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇలా తొలి సినిమాకు సూపర్ హిట్ ఆల్బమ్ అందించిన సంగీత దర్శకుడిని మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ ముందుగు సాగుతున్న ఈ డైరెక్టర్స్ ఇలాగే కొనసాగుతూ ఎన్నో సూపర్ హిట్స్ ఆల్బమ్స్ అందుకోవాలని ఆశిద్దాం.