మేడ్ ఫర్ ఈచ్ అదర్

Friday,February 10,2017 - 02:00 by Z_CLU

వంశీ సినిమాకి సంతకం చేస్తున్నప్పుడు కనీసం ఊహించి కూడా ఉంటారు. ఒక స్క్రీన్ షేర్ చేసుకోనున్న వీరిద్దరూ కంప్లీట్ లైఫ్ ని షేర్ చేసుకోబోతున్నారని. వంశీ సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుకి, నమ్రతల కరియర్ కి ఎంత ప్లస్ అయింది పక్కన పెడితే, ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగిన ఓ ప్రేమజంట ని ఒక్కటి చేసింది. ఫిబ్రవరి 10 2005 న ఒక్కటైన ఈ ప్రేమజంట ఈ రోజు తమ వెడ్డింగ్ ఆనివర్సరీ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.

పెళ్ళికి ముందే మిస్ ఇండియా కిరీటాన్ని దక్కించుకున్న నమ్రతా శిరోద్కర్, పెళ్ళి తరవాత కంప్లీట్ గా ఫ్యామిలీకే డెడికేట్ అయిపోయింది. ఫాస్ట్ పేజ్ లో దూసుకుపోతున్న టైం లోనే మహేష్ బాబుని పెళ్ళాడిన ఈ అందాల తార  టాలీవుడ్ మోస్ట్ డిజైరబుల్ సూపర్ స్టార్ కి జస్ట్ వైఫే కాదు, బ్యాక్ బోన్. సినిమాల స్టోరీ డిస్కషన్స్ దగ్గరి నుండి, సినిమా షెడ్యూల్స్ వరకు దగ్గరుండి చూసుకునే నమ్రత,మహేష్ బాబు బిజీ షెడ్యూల్స్ మధ్య ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార ల ప్రతీ రెస్పాన్స్ బిలిటీని అంతే ఈజ్ తో హ్యాండిల్ చేసుకుంటుంది.

సినిమాలే కాకుండా ఊరిని దత్తత తీసుకునే లాంటి సేవా కార్యక్రమాలలోను చురుగ్గా పాల్గొనే నమ్రత, ప్రతీది తానే దగ్గరుండి మానిటర్ చూస్తుంది. మహేష్ బాబు కూడా అటు టాలీవుడ్ లో టాప్ స్టార్ రేంజ్ ని మెయిన్ టైన్ చేస్తూనే, ఫ్యామిలీకి ఎప్పుడూ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు. సినిమా సినిమాకి మధ్య వచ్చే గ్యాప్ లో, కంపల్సరీగా ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేసే మహేష్ బాబుకి ఫ్యామిలీనే మెయిన్ స్ట్రెంత్ వెల్త్.

Namrata Shirodkar, Gautham, Sitara Ghattamaneni, Mahesh Babu @ Brahmotsavam Audio Launch Stills

 

అది love at first sight అని మహేష్ బాబు కానీ, నమ్రత కానీ ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ, టాలీవుడ్ లో మోస్ట్ అడోరబుల్ కపుల్ లో నమ్రతా మహేష్ కపుల్ ఫస్ట్ ప్లేస్ లో ఉంటారు. ఈ రోజు తమ 12 వ వెడ్డింగ్ ఆనివర్సరీ జరుపుకుంటున్న ఈ కపుల్ ని మనస్పూర్తిగా విషెస్ తెలియజేస్తుంది జీ సినిమాలు.