డిఫరెంట్ జోనర్స్ తో మ్యాచో హీరో

Sunday,October 06,2019 - 02:20 by Z_CLU

ప్రస్తుతం ‘చాణక్య’ తో థియేటర్స్ లో సందడి చేస్తున్న గోపీచంద్ నెక్స్ట్ చేసే రెండు సినిమాలకు డిఫరెంట్ జోనర్స్ ఎంచుకున్నాడు. ఇటివలే బిను సుబ్రహ్మణ్యం డైరెక్షన్ లో  ప్రారంభమైన సినిమా యాక్షన్ అడ్వెంచర్ గా తెరకెక్కబోతుందట. గోపీచంద్ కి మరో ‘సాహసం’ లాంటి సినిమా అంటున్నారు. ఈ సినిమా తర్వాత సంపత్ నందితో సినిమా చేయనున్నాడు. ఇది కంప్లీట్ స్పోర్ట్స్ డ్రామా అట.

సినిమాలో గోపీచంద్ తో పాటు తమన్నా కూడా కబడ్డీ కోచ్ గా కనిపించనుందని తెలుస్తుంది. ఈ రెండు సినిమాలను డిఫరెంట్ జోనర్స్ లో ప్లాన్ చేసుకొని ఏక కాలంలో షూటింగ్ పూర్తి చేసి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవాలని చూస్తున్నాడు మ్యాచో హీరో. మరి ఈ రెండు సినిమాలు గోపీచంద్ కి ఏ రేంజ్ హిట్స్ అందిస్తాయో చూడాలి.