"మా" ఎన్నికల్లో గెలుపు నరేష్ దే

Monday,March 11,2019 - 12:24 by Z_CLU

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. నిన్న పోలింగ్ జరగగా, ఈరోజు ఉదయం రిజల్ట్స్ ఎనౌన్స్ చేశారు. సీనియర్ యాక్టర్ నరేష్ కు చెందిన ప్యానెల్ విజయం సాధించింది. మా అధ్యక్షుడిగా శివాజీ రాజాపై నరేష్ గెలిచారు. ఈ పదవిలో రెండేళ్ల పాటు కొనసాగుతారాయన.

ఇక నరేష్ ప్యానెల్ కు చెందిన రాజశేఖర్, జీవిత కూడా గెలిచారు. ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిటెంట్ గా శ్రీకాంత్ పై రాజశేఖర్ గెలవగా.. జనరల్ సెక్రటరీగా రఘుబాబుపై జీవిత గెలిచారు. వైస్ ప్రెసిడెంట్స్ గా ఎస్వీ కృష్ణారెడ్డి, హేమ ఎన్నికయ్యారు. జాయింట్ సెక్రటరీగా శివబాలాజీ, ట్రెజరర్ గా రాజీవ్ కనకాల గెలిచారు.

ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులుగా 18 మంది ఎన్నికయ్యారు. వీళ్లలో అలీ, అనితా చౌదరి, రాజారవీంద్ర, తణికెళ్ల భరణి, వేణుమాధవ్ వంటి ప్రముఖులున్నారు.