5 మిలియన్ వ్యూస్.. అందరికీ థాంక్స్ -అనంత్ శ్రీరాం

Sunday,July 15,2018 - 09:02 by Z_CLU

ఇటివలే విడుదలైన ‘గీతా గోవిందం’ సినిమాలోని ‘ఇంకేం ఇంకేం కావలే’ సాంగ్ ప్రెజెంట్ అందరినీ ఎట్రాక్ట్ చేస్తూ 5 మిలియన్ వ్యూస్ దూసుకెళ్తుంది. ఈ సందర్భంగా గీత రచయిత అనంత్ శ్రీరాం మీడియాతో మాట్లాడారు.

అనంత్ శ్రీరాం మాట్లాడుతూ ” ‘గీతా గోవిందం’ సినిమా నుండి మేము విడుదల చేసిన మొదటి పాట ‘ఇంకేం ఇంకేం కావలే’ నాలుగు రోజుల్లోనే 5 మిలియన్ వ్యూస్ సాదించడం ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ వ్యూస్ ప్రస్తుతం విజయ్ దేవేరకొండ కున్న క్రేజ్ కూడా తెలియజేస్తున్నాయి. పాట విని చాలా మంది నాకు ఫోన్స్, మెసేజెస్ ద్వారా వారి స్పందన తెలియజేస్తూనే ఉన్నారు. వారందరికీ ఈ సందర్భంగా నా ధన్యవాదాలు. ఈ పాట ఇంకా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నా. అందులో ఎటువంటి సందేహం లేదు. మిగిలిన పాటలు కూడా కచ్చితంగా అందరినీ ఆకట్టుకునేలా ఉంటూ సినిమా విజయంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. నాకో మంచి సందర్భాన్నిచ్చి నాతో ఈ పాటను రాయించుకున్న సంగీత దర్శకుడు గోపి సుందర్ గారికి అలాగే దర్శకుడు పరశురాం గారికి నిర్మాత అల్లు అరవింద్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ సినిమాలో నేను రాసిన మరో పాట కూడా ఇలాగే ఆదరించాలని ఆశిస్తున్నాను.”అన్నారు.