లక్కీ స్టార్స్ 2017

Sunday,December 31,2017 - 03:25 by Z_CLU

టాలీవుడ్ లో ఈ ఏడాది కొంతమందికి భలే కలిసొచ్చింది. అప్పటివరకు సక్సెస్ లేక ఇబ్బందిపడిన స్టార్స్ అంతా 2017లో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చారు. అలా స్టార్ డమ్ తెచ్చుకున్న హీరోహీరోయిన్లు ఎవరో చూద్దాం.

హలో సినిమాతో 2017లో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు అఖిల్. మొదటి సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ అక్కినేని హీరో.. హలోను రీలాంఛ్ మూవీగా చెబుతాడు. ఈ సినిమా సక్సెస్ తో 2018ను గ్రాండ్ గా ప్రారంభించబోతున్నాడు అఖిల్.

2017లో లైమ్ లైట్లోకి వచ్చిన మరో హీరోయిన్ పూజా హెగ్డే. అంతకుముందు చేసిన సినిమాలేవీ ఆమెకు పెద్దగా కలిసిరాలేదు. కానీ బన్నీ సరసన చేసిన డీజే సినిమా పూజాను టాప్ హీరోయిన్ల లిస్ట్ లోకి చేర్చేసింది. ఈ సినిమా సక్సెస్ తో 2018లో మరిన్ని సినిమాలు చేస్తోంది పూజా.

ఇక 2017లో మంచి సక్సెస్ అందుకున్న హీరో రాజశేఖర్. దాదాపు దశాబ్దానికి పైగా హిట్ లేక ఇబ్బందిపడిన ఈ సీనియర్ హీరో, గరుడవేగ సినిమాతో ఒక్కసారిగా అందరి దృష్టిలో పడ్డాడు.

2017 లక్కీస్టార్స్ లో రానా కూడా ఉన్నాడు. బాహుబలి-2తో పెద్ద హిట్ కొట్టడమే కాకుండా.. నేనే రాజు నేనే మంత్రి, ఘాజి సినిమాతో కూడా విజయాలు అందుకొని హ్యాట్రిక్ కొట్టాడు రానా.

చాన్నాళ్లుగా సక్సెస్ లేక ఇబ్బందిపడిన రవితేజ కూడా 2017లో ట్రాక్ లోకి వచ్చాడు. రాజా ది గ్రేట్ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించాడు.

హీరో సిద్దార్థ్ కూడా అంతే. చాలా ఏళ్లయింది హిట్ కొట్టి. ఎట్టకేలకు గృహం సినిమాతో కమర్షియల్ గా సక్సెస్ అందుకోవడంతో పాటు క్రిటిక్స్ మెప్పు పొందాడు.

సుమంత్ కూడా దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ రావా సినిమాతో సక్సెస్ కొట్టాడు. గోల్కొండ హైస్కూల్ సినిమా తర్వాత మళ్లీ హిట్ లేదు సుమంత్.మధ్యలో కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ కాలేదు. ఎట్టకేలకు మళ్లీ రావా మూవీతో సక్సెస్ కొట్టాడు.

హీరోయిన్లలో తాప్సి కూడా 2017లో మెరిసింది. తెలుగుతెరకు దాదాపు దూరమైన ఈ బ్యూటీ, ఆనందో బ్రహ్మ సినిమాతో టాలీవుడ్ లో మళ్లీ హిట్ కొట్టింది. లో-బడ్జెట్ తో తెరకెక్కి భారీ విజయం అందుకున్న ఈ సినిమా తాప్సి కెరీర్ కు మరింత ప్లస్ అయింది

ఇక ఈ ఏడాది మెరిసిన స్టార్స్ లో మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఉన్నాడు. ముకుందతో హీరోగా మారినప్పటి నుంచి తన కాంపౌండ్ కు తగ్గ హిట్ అందుకోలేకపోయిన వరుణ్.. ఎట్టకేలకు ఫిదాతో మెమొరబుల్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.