మెగా రీమేక్.. పక్కా పైసా వసూల్

Wednesday,July 01,2020 - 01:54 by Z_CLU

కొన్ని రీమేక్ సినిమాలు తెలుగులో వర్కౌట్ అవ్వవు. కానీ కంటెంట్ నచ్చి ఆ సినిమా రైట్స్ తీసుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు తెస్తారు మన నిర్మాతలు. తర్వాత రిజల్ట్ చూసి అనవసరంగా పెట్టుబడి పెట్టామని బాధపడుతుంటారు. అయితే అన్నీ అలా ఉండవు. కొన్ని రీమేక్స్ మాత్రం తెలుగులోనూ మంచి ప్రేక్షకాదరణ పొందుతుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అలాంటి పైసావసూల్ చేసే రీమేక్ గురించే.

మెగాస్టార్ తెలుగులో రీమేక్ చేయబోతున్న ఆ సినిమానే ‘లూసిఫర్’. మోహన్ లాల్ హీరోగా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా తెలుగులో కూడా వర్కౌట్ అవ్వడం గ్యారెంటీ. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా మెగాస్టార్ ఇమేజ్ కి పర్ఫెక్ట్ గా సూటవుతుందనడంలో సందేహం లేదు.

సెకండ్ ఇన్నింగ్స్ లో మెగా ఫ్యాన్స్ చిరును ఎలాంటి కథలో చూడాలనుకుంటున్నారో సరిగ్గా అలాంటి పవర్ ఫుల్ కథే లూసిఫర్ లో ఉంది. మంచితనం, హీరోయిజం, ట్విస్టులు, పొలిటికల్ డ్రామా, ఔరా అనిపించే క్లైమాక్స్ ఇలా అన్నీ ఉన్న ఈ కథతో మెగాస్టార్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టడం ఖాయం అనిపిస్తుంది.

అందుకే ఏరికోరి మరీ చిరు కోసం ఈ రీమేక్ ను సిద్దం చేస్తున్నాడు చరణ్. సుజీత్ కూడా ఈ రీమేక్ పై కాన్ఫిడెంట్ గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగు వర్షన్ కోసం చాలా మార్పులు చేశాడు. కథను డిస్టర్బ్ చేయకుండా మన ప్రేక్షకులకు నచ్చేలా అవి ఉంటాయి.