#LoveStory - పండగ రిలీజ్?

Monday,August 09,2021 - 05:02 by Z_CLU

నాగచైతన్య, సాయి పలవి కాంబినేషన్ లో శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరి’ రిలీజ్ కి రెడీ అవుతుంది. సెకండ్ వేవ్ కారణంగా రిలీజ్ వరకూ వచ్చి పోస్ట్ పోన్ అయిన ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  దసరా కి ఎన్టీఆర్ , రామ్ చరణ్ ల ‘RRR’ సినిమా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. ఆ సినిమా రిలీజ్ కంటే ముందే ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లానింగ్ లో ఉన్నారట.

love story nagachaitanya sai pallavi

‘లవ్ స్టోరీ’లో చైతూ, సాయిపల్లవి

అక్టోబర్ మొదటి వారంలో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావడానికి మేకర్స్ రెడీ అవుతున్నారని తెలుస్తుంది. అప్పటి కల్లా అంతా సద్దు మణిగి మళ్ళీ ఫ్యామిలీస్ థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తారని , అలాగే తెలంగాణా లో పెద్ద పండుగగా భావించే ఆ సీజన్ లో తెలంగాణా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాను రిలీజ్ చేస్తే రెస్పాన్స్ బాగుంటుందని భావిస్తున్నారట. ప్రస్తుతానికి మేకర్స్ నుండి అఫీషియల్ ఎలాంటి న్యూస్ రావడం లేదు. కానీ సినిమాను OTT ఓ కాకుండా థియేటర్స్ లో మాత్రమే రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు.

love story nagachaitanya sai pallavi

ఇప్పటికే రిలీజైన టీజర్స్ , సాంగ్స్ సినిమాపై భారీ క్రేజ్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ‘సారంగా దరియా’ పాట రికార్డు స్థాయిలో యుట్యూబ్ లో వ్యూస్ సాధించి సినిమాపై భారీ అంచనాలు పెంచేసింది. ఫిదా తర్వాత శేఖర్ కమ్ముల , సాయి పల్లవి  క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా దసరా బరిలో నిలిచి ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి. త్వరలోనే మేకర్స్ అఫీషియల్ రిలీజ్ డేట్ ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయి.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics