LoveStory - సెట్స్ పైకొచ్చిన నాగచైతన్య

Monday,September 07,2020 - 02:48 by Z_CLU

నాగచైతన్య , సాయి పల్లవి జంటగా సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తీస్తున్న ‘‘లవ్ స్టోరీ’’ చివరి షెడ్యుల్ షూటింగ్ మొదలైంది. ఏమిగోస్ క్రియేషన్స్, సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వరసినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు.

కరోనా/లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ ఈ రోజు నుంచి మళ్లీ మొదలైంది. 15 రోజులు ఏకధాటిగా షూటింగ్ చేసి సినిమాను కంప్లీట్ చేస్తారు.

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం లొకేషన్ లో కేవలం 15 మంది ఉండేలా చూసుకొని షూట్ చేస్తున్నారు. అంతేకాదు.. షూటింగ్ లో పాల్గొనేవారందరికీ ముందే కరోనా టెస్ట్ లు నిర్వహించారు. యూనిట్ అంతతా షెడ్యూల్ కంప్లీట్ అయ్యేదాకా ఇంటికి వెళ్లకుండా లొకేషన్ దగ్గరే ఉండేలా ఏర్పాట్లు చేశారు.

ఈ సినిమాను డైరక్ట్ ఓటీటీ రిలీజ్ కు ఇస్తారనే రూమర్స్ ను యూనిట్ ఖండించింది. త్వరలోనే థియేటర్లలోకి వస్తామని మేకర్స్ ప్రకటించారు.