LoveStory - ఎట్టకేలకు షూట్ కంప్లీట్

Wednesday,November 18,2020 - 05:45 by Z_CLU

ప్లెజంట్ ప్రేమ కథల్ని తనదైన శైలిలో తెరకెక్కించే దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న మరో ఆహ్లాదకర సినిమా ”లవ్ స్టోరి”. ఈ రియలిస్టిక్ ప్రేమ కథలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్నారు.

”లవ్ స్టోరి” సినిమా తాజాగా పాట చిత్రీకరణతో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. ఈ సందర్భాన్ని దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోయిన్ సాయి పల్లవి, కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్, సినిమాటోగ్రాఫర్ విజయ్ సి కుమార్ సెలబ్రేట్ చేసుకుంటూ ఫొటో తీసుకున్నారు.

నిజామాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఈ పాటతో ”లవ్ స్టోరి” సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.

థియేటర్లు తెరుచుకుని, హాల్స్ దగ్గర ఆడియెన్స్ సందడి మొదలు కాగానే ”లవ్ స్టోరి” సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు యూనిట్ ప్రయత్నిస్తోంది.