LoveStory - సమ్మర్ ఎట్రాక్షన్ గా రిలీజ్

Wednesday,January 27,2021 - 12:20 by Z_CLU

ఏడాది కిందట రిలీజ్ అవ్వాల్సిన లవ్ స్టోరీ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సమ్మర్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 16న ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

సినిమాలో నాగచైతన్య-సాయిపల్లవి కెమిస్ట్రీకి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆల్రెడీ రిలీజైన స్టిల్స్, టీజర్ లో వీళ్లిద్దరి కెమిస్ట్రీ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. తాజాగా మరో స్టిల్ కూడా రిలీజ్ చేశారు.

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ బిజినెస్ జరుగుతోంది. చాలా ఏరియాస్ లో ఫ్యాన్స్ రేట్లకు ఈ సినిమా రైట్స్ అమ్ముడుపోతున్నాయి.

రాజీవ్ కనకాల, ఈశ్వరీరావు, దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను.. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కె నారాయణదాస్ నారంగ్, పి.రామ్మోహన్ రావు నిర్మాతలు. పవన్ సంగీతం అందిస్తున్నాడు.