'లవ్ స్టోరి' ...ఫస్ట్ సింగిల్ రిలీజ్

Wednesday,March 11,2020 - 04:57 by Z_CLU

శేఖర్ కమ్ముల సినిమాలో సాంగ్స్ సంథింగ్ స్పెషల్ గా ఉంటాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా వినసొంపైన సాంగ్స్ తీసుకోవడం శేఖర్ కమ్ముల ప్రత్యేకత. అందుకే మ్యూజిక్ లవర్స్ ఆయన సినిమాలో సాంగ్స్ పదే పదే వినడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా మరోసారి తన సినిమాలో సాంగ్ తో ఎట్రాక్ట్ చేస్తున్నాడు శేఖర్ కమ్ముల. ఆయన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ సినిమా నుండి ‘ఏయ్ పిల్లా’ ఫస్ట్ సింగిల్ రిలీజయింది.

ఇటివలే ఈ సాంగ్ కి సంబంధించి విజువల్స్ తో ఓ ప్రోమో విడుదల చేసిన యూనిట్ తాజాగా ఫుల్ లిరికల్ సాంగ్ వదిలారు. పవన్ సీ.హెచ్ కంపోజ్ చేసిన ఈ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ కి చైతన్య పింగళి సాహిత్యం స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో మ్యూజిక్ లవర్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్న ఈ సాంగ్ సినిమాకి హైలైట్ అయ్యేలా అనిపిస్తుంది.