Love Story - ఫస్ట్ వీకెండ్ కలెక్షన్

Monday,September 27,2021 - 05:21 by Z_CLU

నిన్నటితో ఫస్ట్ వీకెండ్ పూర్తిచేసుకుంది లవ్ స్టోరీ సినిమా. ప్రేక్షకులతోనే కాకుండా, క్రిటిక్స్ తో కూడా శభాష్ అనిపించుకున్న ఈ సినిమా.. మొదటి రోజు నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. ఫస్ట్ డే వసూళ్లలో నాగచైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచిన లవ్ స్టోరీ.. వీకెండ్ గడిచేసరికి 50 కోట్ల రూపాయల మార్క్ అందుకుంది.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు 50 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. ఏపీ, నైజాంలో కలిపి ఈ సినిమాకు 25 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఆంధ్రా, సీడెడ్, నైజాం అనే తేడా లేకుండా అన్ని సెంటర్ల నుంచి ఈ సినిమాకు మంచి వసూళ్లు వస్తున్నాయి.

అటు ఓవర్సీస్ లో లవ్ స్టోరీ సినిమా మిలియన్ డాలర్ మార్క్ అందుకుంది. సెకెండ్ వేవ్ తర్వాత మిలియన్ డాలర్ క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా ఇది రికార్డ్ సృష్టించింది.

ఏపీ,నైజాం 3 రోజుల షేర్స్
నైజాం – రూ. 8.90 కోట్లు
సీడెడ్ – రూ. 2.88 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 2.13 కోట్లు
ఈస్ట్ – రూ. 1.06 కోట్లు
వెస్ట్ – రూ. 0.96 కోట్లు
గుంటూరు – రూ. 1.13 కోట్లు
కృష్ణా – రూ. 0.87 కోట్లు
నెల్లూరు – రూ. 0.54 కోట్లు

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics