లండన్ బాబులు : టాలీవుడ్ నుంచి ట్రెమండస్ రెస్పాన్స్

Thursday,November 16,2017 - 01:25 by Z_CLU

చిన్నికృష్ణ డైరెక్షన్ లో మారుతి నిర్మించిన ‘లండన్ బాబులు’ నవంబర్ 17 న థియేటర్స్ లోకి వస్తుంది. ఈ సందర్భంగా సినీ ప్రముఖుల కోసం వేసిన ప్రత్యేక షో లో సినిమా చూసిన వారంతా సినిమా బావుందని అప్రీషియేట్ చేశారు.

మారుతి : లండన్ బాబులు ప్రీమియర్ చూశాను.. సినిమా చాలా బావుంది. చిన్నికృష్ణ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను.

రఘు కారుమంచి : సినిమా చాలా బాగా వచ్చింది. లండన్ బాబులు టీమ్ కి గుడ్ లక్.

నవీన్ చంద్ర : ఇప్పుడే సినిమా చూశాను. సినిమా చాలా బావుంది. ప్రతి ఒక్కరి పర్ఫామెన్స్ చాలా బావుంది. లండన్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా చూడాల్సిన సినిమా. ఆల్ ద బెస్ట్ టీమ్.

పరుచూరి గోపాల కృష్ణ  : ‘లండన్ బాబులు’ యూత్ కి మంచి ఎడ్యుకేటివ్ సినిమా. విదేశాలకు వెళ్లి ఏదో సంపాదించేసుకుందామనుకునే పిల్లలకు మంచి మెసేజ్ ఇచ్చే సినిమా. యూత్ కంపల్సరీగా చూడాల్సిన సినిమా… రక్షిత్, స్వాతి చాలా బాగా పర్ఫామ్ చేశారు.

నరేష్ : రక్షిత్ పర్ఫామెన్స్ చాలా మెచ్యూర్డ్ గా ఉంది. ఫస్టాఫ్ ఎంటర్ టైన్ మెంట్ తో పాటు, డైలాగ్స్ చాలా బావున్నాయి. సెకండాఫ్ లో మంచి టర్న్స్ ఉన్నాయి. నీట్ గా తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్. ఈ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

మనోజ్ నంద : సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా చాలా బావుంది. సత్య కామెడీ చాలా బావుంది. సెకండాఫ్ లో స్ట్రాంగ్ కంటెంట్ తో ఎంటర్ టైనింగ్ గా ఉంది. డెఫ్ఫినేట్ గా ఈ సినిమా ఈ వీక్ హిట్ సినిమాల లిస్టులో ఫస్ట్ ఉంటుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను.

మధుశాలిని : లండన్ బాబులు చాలా పెద్ద సక్సెస్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తరవాత మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూశాను. రక్షిత్ పర్ఫామెన్స్ చాలా బావుంది. మొత్తం టీమ్ కి కంగ్రాచ్యులేషన్స్.

ధనరాజ్ : ‘పిల్ల జమీందార్’ తరవాత ఈ సినిమాలో మళ్ళీ అంత మంచి క్యారెక్టర్ చేశాను. రక్షిత్ ఫస్ట్ సినిమా అయినా చాలా బాగా చేశాడు. సినిమా సూపర్ హిట్ గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది.

స్వాతి : లండన్ బాబులు చాలా సింపుల్ అండ్ సిన్సియర్ మూవీ. ఇక్కడ చూసిన వాళ్ళందరికీ సినిమా చాలా బాగా నచ్చింది. మీ అందరికీ కూడా సినిమా నచ్చాలని కోరుకుంటున్నాం.

రక్షిత్ : లండన్ బాబులు సినిమా చాలా బాగా వచ్చింది. నరేష్ గారు, పరుచూరి గోపాల కృష్ణ గారు కూడా అప్రీషియేట్ చేశారు . నవంబర్ 17 న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. మీరందరూ చూసి ఆనందిస్తారని ఆశిస్తున్నాం.

చిన్నికృష్ణ : లండన్ బాబు సినిమా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులందరి తో పాటు ప్రొడ్యూసర్ మారుతి గారికి ఈ సందర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను.