పూరి హీరోలు వీళ్ళే!

Sunday,September 10,2017 - 01:14 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే స్టార్ డైరెక్టర్ ఎవరా..అంటే తక్కువ వినిపించే పేరు పూరి. లేటెస్ట్ గా బాలయ్యతో ‘పైసా వసూల్’ సినిమా చేసిన పూరి నెక్స్ట్ ఓ ఏడుగురు హీరోలతో 7 సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే పూరి హీరోల కనిపించేందుకు లిస్టు లో కొందరు హీరోలు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే.. మరి పూరి లిస్టు లో ఉన్న ఆ హీరోలేవరో ఓ లుక్కేడ్డం.


ప్రస్తుతం పూరి నెక్స్ట్ హీరో లిస్టు లో వినిపిస్తున్న మొదటి పేరు ఇషాన్.. రోగ్ సినిమాతో ఇషాన్ ను తెలుగు సినీ రంగానికి పరిచయం చేసిన పూరి ఆ టైంలోనే ఇషాన్ తో మరో సినిమా కమిట్ అయ్యాడట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి కథా చర్చలు కూడా జరుగుతున్నాయని టాక్.. సో పూరి నెక్స్ట్ లిస్టు లో ఫస్ట్ ప్లేస్ ఇషాన్ దే.

పూరి నెక్స్ట్ లిస్టు లో బాలయ్య కూడా ఉన్నాడు. లేటెస్ట్ గా పూరితో ‘పైసా వసూల్’ సినిమా చేసిన బాలయ్య పూరి మేకింగ్ స్టైల్ నచ్చి మరో సినిమా చాన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం కె.ఎస్.రవి కుమార్ డైరెక్షన్ లో నటిస్తున్న బాలయ్య పూరితో 103 కి గాని, 104 సినిమా గాని చేసే ఛాన్స్ ఉంది.


తన తనయుడు ఆకాష్ తో కూడా ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట పూరి.. ఇప్పటికే సిల్వర్ స్క్రీన్ పై హీరోగా ఎంట్రీ ఇచ్చేసిన ఆకాష్ మళ్ళీ గ్రాండ్ గా లాంచ్ చేయాలనీ చూస్తున్నాడట. అన్ని కుదిరితే నెక్స్ట్ ఇయర్ ఆకాష్ తో సినిమాను స్టార్ట్ చేయాలనీ భావిస్తున్నాడు పూరి.


ఇక మాస్ మహారాజ్ రవితేజ తో కూడా మరో సినిమా ప్లాన్ చేస్తున్నాడు పూరి. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో 5 సినిమాలొచ్చిన సంగతి తెలిసిందే..అయితే ఇప్పుడు రవి తేజతో 6 సినిమా ప్లానింగ్ లో కూడా ఉన్నాడట పూరి. ఈ కాంబినేషన్ లో రానున్న మరో సినిమాపై చాలా ఇంటర్వూస్ లో కచ్చితంగా త్వరలోనే సినిమా ఉంటుందంటూ కన్ఫర్మ్ చేశారు కూడా. సో పూరి నెక్స్ట్ లిస్ట్ లో రవి తేజ కూడా ఉన్నాడు.


పూరి లిస్ట్ లో మెగా స్టార్ చిరంజీవి కూడా ఉన్నాడు. ఇప్పటికే చిరు కి ఓ స్క్రిప్ట్ వినిపించిన పూరి త్వరలోనే చిరు ని డైరెక్ట్ చేయాలనీ ఉవ్విళ్లూరుతున్నాడు.. ఇక లేటెస్ట్ గా చిరు కూడా పూరి తో త్వరలోనే ఓ సినిమా చేస్తానని చెప్పడంతో పూరి లిస్ట్ లో మెగాస్టార్ కూడా ఉన్నట్టే.

ఎంత మంది హీరోలు చేతిలో ఉన్నా పూరి కన్ను మాత్రం మహేష్ పైనే ఉంది. మహేష్ తో ఇప్పటికే రెండు సినిమాలు చేసిన పూరి మహేష్ తో త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ సినిమా చేయాలని చూస్తున్నాడు. పొలిటికల్ డ్రామా గా తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసి రెడీ గా ఉన్నాడు పూరి.

ఇక విక్టరీ వెంకటేష్ తో కూడా ఓ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు పూరి. లేటెస్ట్ గా పూరితో త్వరలోనే ఓ సినిమా చేస్తానని, కానీ అది ఎప్పుడు ఉంటుందో మాత్రం ఇప్పుడే చెప్పాలనేనంటూ చెప్పాడు వెంకీ. సో పూరి నెక్స్ట్ లిస్ట్ లో విక్టరీవెంకటేష్ కూడా ఉన్నాడు.