Liger Movie లెజెండ్ తో ఢీ !

Tuesday,November 16,2021 - 11:40 by Z_CLU

Liger US Scedule starts , Mike Tyson joins the shoot

విజయ్ దేవరకొండ –పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘లైగర్‘ సినిమా అమెరికా షెడ్యుల్ మొదలైంది. అక్కడ సినిమాలో కీలకమైన యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేస్తున్నారు. లెజెండ్ మైక్ టైసన్ షూట్ లో పాల్గొన్నాడు. ప్రస్తుతం విజయ్ – టైసన్ మధ్య యాక్షన్ ఎపిసోడ్స్ తీస్తున్నారు. ఫారెన్ ఫైటర్స్ కూడా షూట్ లో పాల్గొంటున్నారు.

మైక్ టైసన్ తో కలిసి విజయ్ దేవరకొండ ఓ ఫోటో దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. టైసన్ తో ఎవిరీ మూమెంట్ మెమోరీస్ అని చెప్తూ  అవన్నీ తనకి చాలా స్పెషల్ అంటూ తెలిపాడు విజయ్. అంతే కాదు ‘లైగర్ వర్సెస్ లెజెండ్’ అని పోస్ట్ లో మెన్షన్ చేశాడు. అలాగే టైసన్ పక్కన నిల్చొని డిఫరెంట్ గా ఫోటో కి ఫోజ్ ఇచ్చాడు విజయ్.

ప్రస్తుతం టైసన్ , విజయ్ కలిసి ఉన్న సెట్ లో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లైగర్ షూట్ లో టైసన్ జాయిన్ అయ్యారు అంటూ చెప్పగానే ఈ సినిమాపై మూవీ లవర్స్ లో చర్చ మొదలైంది. ఫర్ ది ఫస్ట్ టైం తెలుగు సినిమాలో మైక్ టైసన్ నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ పై ఎక్కడలేని అంచనాలు నెలకొంటున్నాయి.

‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి పూరి , చార్మీ   నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానుంది. విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తుంది.

Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics