Liger Trailer - విజయ్ దేవరకొండ మూవీ ట్రయిలర్ రెడీ

Sunday,July 17,2022 - 09:56 by Z_CLU

విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ ల క్రేజీ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ”లైగర్” (సాలా క్రాస్‌బ్రీడ్). రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో, ఈ సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. లైగర్ నుండి విడుదలైన విజయ్ దేవరకొండ బోల్డ్ పోస్టర్ ఆశ్చర్యానికి గురిచేస్తే, ఫస్ట్ సింగిల్ అక్డీ పక్డీ డ్యాన్స్ నంబర్ ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. ఈ పాట ఇప్పటివరకు 30 మిలియన్+ వ్యూస్ తో దేశవ్యాప్తంగా ట్రెండింగ్‌లో ఉంది.

ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 21న అన్ని భాషల్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ట్రైలర్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో చుట్టూ ఫైటర్స్ ఉండగా విజయ్ మధ్యలో నిలబడి ఫైట్ కి రెడీ అవ్వడం గమనించవచ్చు.

LIGER

లైగర్ యూనిట్ విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండను MMA (మిక్స్ డ్ మార్షల్ ఆర్ట్స్) ఫైటర్‌గా ప్రజంట్ చేసింది యూనిట్. ఫస్ట్ గ్లింప్స్ లో విజయ్ దేవరకొండపై మాత్రమే దృష్టి పెట్టారు. మరో ఐదు రోజుల్లో విడుదల కానున్న ట్రైలర్.. మైక్ టైసన్‌తో సహా ఇతర నటీనటులు, సినిమా కంటెంట్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించనుంది.

లైగర్ లో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా సంయుక్తంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

Akdi Pakdi Song From Vijay Deverakonda, Puri Jagannadh’s LIGER (Saala Crossbreed) Out

హిందీ, తెలుగు, తమిళం, కన్నడ , మలయాళం భాషల్లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా చిత్రం 2022 ఆగస్టు 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.