Liger - దేవరకొండ ఫ్యాన్స్ నుంచి స్పెషల్ రిక్వెస్ట్

Wednesday,May 05,2021 - 06:02 by Z_CLU

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్ విజయ్ దేవరకొండ ‘లైగర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబోలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ స్టేజిలో ఉంది. ఇటివలే ముంబై లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు గోవాలో కొన్ని సీన్స్ సాంగ్ షూట్ చేశారు యూనిట్. ప్రస్తుతం కరోన ఎఫెక్ట్ కారణంగా షూటింగ్ వాయిదా వేసుకున్నారు. అయితే షూటింగ్ మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు జస్ట్ ఫస్ట్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ నెల 9న విజయ్ దేవేరకొండ పుట్టిన రోజు సందర్భంగా లైగర్ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయాలంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

Liger-Release-poster-zeecinemalu

నిజానికి విజయ్ బర్త్ డే సందర్భంగా టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచాలనుకున్నారు. కానీ ప్రస్తుతం కోవిడ్ సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నందు వల్ల టీజర్ రిలీజ్ ని పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారు. అయితే టీజర్ రిలీజ్ చేయకపోయినా సినిమాకు సంబంధించి పోస్టర్ వదిలి విజయ్ కి విషెస్ చెప్పే ప్లాన్ లో ఉన్నారట పూరి అండ్ టీం. కానీ విజయ్ బాక్సింగ్ షాట్స్ తో ఓ స్టైలిష్ యాక్షన్ టీజర్ విడుదల చేస్తే బాగుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు రౌడీ ఫ్యాన్స్.

liger first look poster

ఒక వేళ విజయ్ బర్త్ డే కి టీజర్ రిలీజ్ చేయకపోతే అన్నీ చక్కబడిన వెంటనే ఓ డేట్ చూసి ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. కరణ్ జోహార్ , పూరి , ఛార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాలో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. రమ్య కృష్ణ ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ సినిమాకు బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ వర్క్ చేస్తున్నాడు. త్వరలోనే అతని పేరుని ప్రకటించే ఆలోచనలో ఉన్నారు.

  • – Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending
    stories, Gossips, Actress Photos and Special topics