ఫినిషింగ్ స్టేజీ లో 'లై'

Tuesday,June 13,2017 - 04:10 by Z_CLU

లేటెస్ట్ గా ‘అ ఆ’ తో కెరీర్ లో గ్రాండ్ హిట్ అందుకున్న నితిన్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లై’ (లవ్‌ ఇంటెలిజెన్స్‌ ఎన్‌మిటి). హను రాఘవపూడి డైరెక్షన్ లో వెంకట్‌ బోయనపల్లి సమర్పణలో 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ పై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట, అనీల్‌ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.

మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ‘బాంభాట్‌’ అనే సాంగ్ ను ఇటీవలే చికాగోలో గ్రాండ్ ఈవెంట్ లో రిలీజ్ చేశారు మేకర్స్ . 75 రోజులపాటు అమెరికాలోని వివిధ లొకేషన్లలో టాకీతోపాటు భారీ యాక్షన్‌ సీన్స్‌ షూట్‌ జరుపుకున్న ఈ సినిమా మరో 10 రోజులపాటు హైదరాబాద్‌లో జరిగే షెడ్యూల్‌తో టోటల్‌గా షూటింగ్‌ పూర్తిచేసుకోనుంది. నితిన్ సరసన మేఘ ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ ఓ కీ రోల్ లో నటిస్తున్నాడు.  అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఆగస్ట్‌ 11న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్‌ చెయ్యడానికి ప్లాన్‌ చేస్తున్నారు.