సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి 'లై'

Friday,August 18,2017 - 03:33 by Z_CLU

యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీ లై.. సక్సెస్ ఫుల్ గా సెకెండ్ వీక్ లోకి ఎంటరైంది. యూత్ స్టార్ నితిన్-హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ సినిమా అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. సినిమా చాలా కొత్తగా ఉందని ఫీలవుతున్నారు ప్రేక్షకులు. మరీ ముఖ్యంగా అర్జున్ పర్ ఫార్మెన్స్, లై సినిమాకు బ్యాక్ బోన్ గా నిలించింది.

అ..ఆ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో నితిన్ సెలక్ట్ చేసుకున్న సినిమా ఇది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు, రాష్ట్రాల్లో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. అటు ఓవర్సీస్ నుంచి కూడా ‘లై’ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సినిమా కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉందంటూ చాలామంది ఓవర్సీస్ ప్రేక్షకులు సోషల్ మీడియాలో రెస్పాండ్ అవుతున్నారు

మణిశర్మ సంగీతం సినిమాకు మరో ప్లస్ పాయింట్ గా నిలిచింది. బొంబాట్ సాంగ్ తో బ్లాక్ బస్టర్ సింగిల్ ను అందించిన మణిశర్మ.. రీ-రికార్డింగ్ తో ‘లై’ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాడు. మలయాళీ బ్యూటీ మేఘా ఆకాష్ ఈ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది.