‘లై’ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్సయింది
Thursday,August 03,2017 - 03:03 by Z_CLU
ఆగష్టు 11 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది నితిన్ ‘లై’. రీసెంట్ గా రిలీజైన 3 పాటలు సూపర్ హిట్ అనిపించుకున్నాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రమోషన్ డోస్ పెంచేసిన సినిమా యూనిట్, ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ కూడా ఫిక్స్ చేసేసుకుంది. ఆగష్టు 5 న గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సెలెబ్రేట్ చేసుకోనుంది ‘లై’ సినిమా యూనిట్.
హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే బోలెడంత క్యూరాసిటీ ని రేజ్ చేస్తుంది. అర్జున్ క్యారెక్టర్ ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసిన టీజర్ దగ్గరి నుండి, నితిన్ ని మోస్ట్ స్టైలిష్ లుక్స్ తో ఎట్రాక్ట్ చేసిన ట్రేలర్, దానికి తోడు సాంగ్స్, ఈ సినిమాపై భారీ రేంజ్ లో ఎక్స్ పెక్టేషన్స్ ని క్రియేట్ చేశాయి.

మేఘా ఆకాష్ హీరొయిన్ గా నటించిన ఈ సినిమాని రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మించారు. మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.