'లై' సెన్సార్ పూర్తి.. ఈ వీకెండ్ గ్రాండ్ రిలీజ్

Tuesday,August 08,2017 - 12:13 by Z_CLU

అ..ఆ లాంటి ట్రెమండస్ సక్సెస్ తర్వాత నితిన్ నటిస్తున్న ‘లై’ పై అంచనాలు భారీగా పెరిగాయి. నితిన్ మేకోవర్ కు అదిరిపోయే రెస్పాన్స్ రావడం, సినిమా టీజర్, ట్రయిలర్ సూపర్ హిట్ అవ్వడంతో ‘లై’ కోసం ఆడియన్స్ ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తిచేసుకుంది. సెన్సార్ అధికారులు ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ ఇచ్చారు. సెన్సార్ ఫార్మాలిటీస్ కూడా పూర్తవ్వడంతో.. మూవీ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. ఈ వీకెండ్, ఆగస్ట్ 11న లై సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలకానుంది.

సరికొత్త స్టయిలిష్ మేకోవర్ లో నితిన్ నటించిన లై సినిమా, ఈ హీరో కెరీర్ లోనే భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కింది. 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై హను రాఘవపూడి డైరక్ట్ చేసిన ఈ సినిమాతో మేఘా ఆకాష్ హీరోయిన్ గా పరిచయమౌతోంది. మణిశర్మ కంపోజ్ చేసిన సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ కాగా.. ట్రయిలర్ లో రీ-రికార్డింగ్ కు అంతా ఫ్లాట్ అయిపోయారు.

కేవలం బడ్జెట్ లోనే కాదు, రిలీజ్ లో కూడా లై సినిమా నితిన్ కెరీర్ బెస్ట్ గా నిలవబోతోంది. అవును.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో భారీస్థాయిలో విడుదలవుతోంది ‘లై’. నితిన్ కెరీర్ లో ఇప్పటివరకు భారీ రిలీజ్ ఇదే.