లెజెండరీ యాక్టర్ జమున కన్నుమూత

Friday,January 27,2023 - 11:02 by Z_CLU

Legendery Actor Jamuna is no more

తెలుగు చిత్ర పరిశ్రమ మరో లెజెండ్‌ను కోల్పోయింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించిన నటి జమున (Jamuna) ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఆమె వయసు 86.  హంపిలో ఆగష్టు 30, 1936న జన్మించారు,  తన 14వ ఏట పుట్టిల్లు (1952)తో సినీ రంగ ప్రవేశం చేశారు జమున.

తెలుగులో 198కి పైగా సినిమాల్లో నటించింది. మూగ మనసులు, కురుక్షేత్రము, భూకైలాష్, రాముడు భీముడు ఎన్నో గొప్ప చిత్రాల్లో నటించారు. జమున గార చివరి సినిమా అమ్మమ్మగారి మనవడు (2021). జమున గారు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో కూడా నటించారు.

సీనియర్ నటి మృతి పట్ల సినీ పరిశ్రమ సంతాపం వ్యక్తం చేసింది. ఆమె కుటుంబ సభ్యులకు పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్‌కు తరలించి నివాళులర్పిస్తారు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics