కె.విశ్వనాథ్ బర్త్ డే స్పెషల్

Monday,February 19,2018 - 01:15 by Z_CLU

టాలీవుడ్ లెజెండ్రీ డైరెక్టర్స్ లో ముందువరసలో ఉంటారు కాశీనాధుని విశ్వనాథ్. సినిమాపై అభిమానంతో 1957 లో ‘తోడి కోడళ్ళు’ సినిమాతో ఆడియోగ్రాఫర్ గా కెరీర్ ప్రారంభించిన ఆయన..   స్క్రీన్ ప్లే రైటర్, నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుని, ఆ తరవాత డైరెక్టర్ గా అద్భుతమైన సినిమాలను తెరకెక్కించారు.

1930, ఫిబ్రవరి 19న కృష్ణా జిల్లా పెదపులివర్రు గ్రామంలో జన్మించిన ఈయన ఈరోజు తన 88వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

అప్పటికే సినిమాలకు కథలు రాస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గా  పనిచేస్తున్న విశ్వనాథ్ గారు ‘ఆత్మగౌరవం’ సినిమాతో డైరెక్టర్ గా మెగాఫోన్ పట్టుకున్నారు. మానవతా విలువలతో తెరకెక్కిన ఈ సినిమా నంది అవార్డు దక్కించుకుంది. ఈ సినిమాతో దర్శకుడిగా విశ్వనాథ్ గారి సినీప్రయాణం, కేవలం టాలీవుడ్ కే పరిమితం కాలేదు. తమిళ, హిందీ సినిమాల్లోనూ ఆయన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ప్రూఫ్ చేసుకున్నారు.

 

విశ్వనాథ్ గారి దర్శకత్వంలో తెరకెక్కిన మరో ఆణిముత్యం ‘చెల్లెలి కాపురం’. అప్పటికే రొమాంటిక్ హీరోగా ఎస్టాబ్లిష్ అయిన శోభన్ బాబును డిఫెరెంట్ గా ప్రెజెంట్ చేసిన ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడమే కాదు, ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు దక్కించుకుంది.

కథ ఏదైనా సామాజిక దృక్పథం ఆయన సినిమాల్లో కీ ఎలిమెంట్. సోషల్ మెసేజ్ ని కమర్షియల్ సక్సెస్ ని ఒకేసారి జనెరేట్ చేసేవారు విశ్వనాథం గారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ‘కాలం మారింది’ సినిమా. అంటరానితనం కీ ఎలిమెంట్ గా తెరకెక్కిన  ఈ సినిమా నంది అవార్డును దక్కించుకుంది.

జయప్రద, చంద్రమోహన్ జంటగా తెరకెక్కిన ఇమోషనల్ ఎంటర్ టైనర్ ‘సిరిసిరిమువ్వ’. జయప్రదను మూగ అమ్మాయిలా ప్రెజెంట్ చేసిన విశ్వనాథం గారు, ఇమోషనల్ సీక్వెన్సెస్ లలో  ప్రతి సన్నివేశాన్ని హృదయానికి హత్తుకునే విధంగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యారు. ‘సిరిసిరి మువ్వ’ ఆయన కరియర్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంటర్ టైనర్.

అప్పట్లో టాలీవుడ్ సెన్సేషనల్ హిట్ శంకరాభరణం. ఇప్పటికీ క్లాసిక్ సినిమాల్లో మొదటి వరసలో ఉంటుందీ సినిమా. 1980 లో రిలీజైన ఈ సినిమా, డైరెక్టర్ గా విశ్వనాథం గారి స్టామినాని ప్రపంచానికి తెలిసేలా చేసింది.

పెళ్ళి వ్యవస్థ లో ఉన్న గొప్పతనాన్ని ఏ మాత్రం బోర్ కొట్టకుండా ఎమోషనల్  ఎలిమెంట్స్ తో  తెరకెక్కిన సినిమా ‘సప్తపది’. ఇంటర్నేషనల్ మూవీ ఫెస్టివల్స్ కు సైతం ఎంపికైన ఈ సినిమా, ఎన్నో అవార్డులు దక్కించుకుంది.

విశ్వనాథం గారి సినిమాల ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరైనా ‘సాగర సంగమం’ గురించి డిస్కస్ చేయకుండా ఉండలేరు. విశ్వనాథం గారి కరియర్ లోనే కాదు, టాలీవుడ్ లోనే ఆణిముత్యం లాంటి సినిమా ఇది.

 

1986 లో రిలీజైంది రాధిక, కమల హాసన్ జంటగా నటించిన ‘స్వాతిముత్యం’. అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయిన ఈ సినిమాలోని ‘లాలి..లాలి.. లాలి..’ పాట ఇప్పటికీ ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది.  విశ్వనాధ్ నుంచి వచ్చిన మరో ఆణిముత్యం ఇది.

అప్పటికే స్టైలిష్ కమర్షియల్ హీరోగా కొనసాగుతున్న మెగాస్టార్ లోని మరో యాంగిల్ ని ఎలివేట్ చేసింది స్వయంకృషి. ఓ పక్కా కమర్షియల్ హీరో ఇలాంటి కథలో నటిస్తాడని ఎవరూ ఊహించరు. అలాంటిది స్వయంకృషి సినిమాలో చిరంజీవి నటించారంటే అది విశ్వనాథ్ గొప్పదనమే.

 గురుశిష్యుల మద్య అనుబంధంతో పాటు అంతర్లీనంగా మరో ఇంట్రెస్టింగ్ కాంఫ్లిక్ట్ తో మనసుకు హత్తుకునే సన్నివేశాలతో తెరకెక్కిన ‘స్వాతికిరణం’ విశ్వనాథం గారి ప్రతిభకు మరో మచ్చు తునక.

ఇలా చెప్పుకుంటూ పోతే కె.విశ్వనాథ్ ప్రతి సినిమా అద్భుతమే. డైరెక్టర్ గా, రచయితగా, ఇప్పటికీ నటుడిగా సిల్వర్ స్క్రీన్ పై ఎంటర్ టైన్ చేస్తున్న కాశీనాథుని విశ్వనాథం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అందిస్తోంది జీ సినిమాలు.