లీడింగ్ లేడీ

Friday,December 09,2016 - 11:00 by Z_CLU

కంచె సినిమాతో ఇంట్రడ్యూస్ అయిన మిలీనియం కాంచనమాల ప్రగ్యా జైస్వాల్ కరియర్ పర్ ఫెక్ట్ ట్రాక్ లో నడుస్తుంది. తన రెండో సినిమాకే ఏకంగా రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘ఓం నమో వెంకటేశాయ’ లో ఛాన్స్ కొట్టేసిన ప్రగ్యా, ఏకంగా టాలీవుడ్ కింగ్ నాగార్జున సరసన హీరోయిన్ గా నటించింది. ఫిబ్రవరి 10 న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రగ్యా స్టాండర్డ్స్ ని రెండింతలు ఇంక్రీజ్ చేయడం ఖాయం.

నమో వెంకటేశాయతో పాటు బోయపాటి శ్రీను, బెల్లంకొండ శ్రీనివాస్ కాంబో లో తెరకెక్కుతున్న సినిమాకి సంతకం చేసిన ప్రగ్యా, ఆల్ రెడీ కమర్షియల్ హీరోయిన్ క్యాటగిరీలో చేరిపోయింది. సినిమా సినిమాకి గ్యాప్ ఉన్నా పర్లేదు కానీ, కరియర్ కి ప్లస్ అవుతుందన్న గ్యారంటీ లేకపోతే సంతకం చేయని ప్రగ్యా ఆచి తూచి అడుగులు వేయడం చూస్తుంటే, 2017 లో టాలీవుడ్ లీడింగ్ లేడీస్ కి గట్టి పోటీ ఇవ్వడం ఖాయమనిపిస్తుంది.