అప్పుడు రజినీ ..ఇప్పుడు లారెన్స్

Friday,April 10,2020 - 01:47 by Z_CLU

‘కాంచన’ సీక్వెల్స్ చేస్తున్న లారెన్స్ ప్రస్తుతం హారర్ జోనర్ కి కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు లారెన్స్. ఎప్పుడో కిల్ అయిపోయిందనుకున్న ఈ జోనర్ లో ఇంకా హిట్లు కొడుతూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాడు. ఇప్పుడు మరో సూపర్ హిట్ హారర్ సినిమా సీక్వెల్ తో రాబోతున్నాడు.

రజనీకాంత్ ప్రధాన పాత్రలో దర్శకుడు పి.వాసు తెరకెక్కించిన ‘చంద్రముఖి’ కి త్వరలోనే సీక్వెల్ వస్తోంది. ఇందులో రజనీ ప్లేస్ లో ఇప్పుడు లారెన్స్ కనిపిస్తాడు. ఈ సీక్వెల్ ను కూడా పి.వాసు నే డైరెక్ట్ చేయనున్నాడు.

తాజాగా ఈ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్నాడు లారెన్స్. అలాగే సూపర్ స్టార్ బ్లెస్సింగ్స్ కూడా అందుకున్నానని తెలియజేశాడు. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించనున్నారు.

ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకున్న లారెన్స్… కరోనా నిర్మూలన ఫండ్ కోసం 3 కోట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. త్వరలోనే ఈ సీక్వెల్ సెట్స్ పైకి రానుంది.