లారెన్స్ `శివ‌లింగ" రిలీజ్ డేట్

Friday,March 17,2017 - 07:00 by Z_CLU

రాఘ‌వ లారెన్స్ న‌టించిన లేటెస్ట్ సినిమా ‘శివ‌లింగ’ రిలీజ్ కి రెడీ అవుతుంది. పి.వాసు దర్శకత్వంలో కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన ‘శివలింగ’ ను అదే టైటిల్ తో అభిషేక్ ఫిలింస్ పతాకంపై రమేష్ పి. పిళ్లై నిర్మించారు.


ప్ర‌స్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.. ఇప్పటికే పోస్ట‌ర్‌,ట్రైల‌ర్‌కు మంచి రెస్పాన్స్ ఈ హారర్ ఎంటర్టైనర్ కచ్చితంగా అందరినీ ఎంటర్టైన్ చేస్తుందంటున్నారు యూనిట్. సో లారెన్స్ త్వరలోనే ‘శివలింగ’ తో థ్రిల్ చేయబోతున్నాడన్నమాట..