లారెన్స్ శివలింగ రిలీజ్ డేట్

Tuesday,April 04,2017 - 07:08 by Z_CLU

వాసు డైరెక్షన్ లో లారెన్స్ హీరోగా నటించిన శివలింగ రిలీజ్ డేట్ ఫిక్సయింది. రితిక సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది. అల్టిమేట్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాకి S.S. తమన్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు.

కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన శివలింగ సినిమాని తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి రీమేక్ చేశారు. హారర్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటి మ్యాగ్జిమం కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాని తెలుగులో మాల్కాపురం శివకుమార్ రిలీజ్ చేస్తున్నారు.

కాంచన, గంగ లాంటి హై ఎండ్ హారర్ కమర్షియల్ ఎంటర్ టైనర్స్ తో తనకంటూ స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకున్న లారెన్స్ ఈ సినిమాతో మరింత క్రేజ్ ని బ్యాగ్ లో వేసుకోవడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉంది సినిమా యూనిట్. ఈ సినిమాకి రమేష్ పిళ్ళై నిర్మాత.