లావణ్య ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,May 09,2017 - 01:13 by Z_CLU

రాధ సినిమాతో మరోసారి మనముందుకు రాబోతోంది లావణ్య త్రిపాఠి. ఈ సినిమాలో తనది వెరీ  వెరీ స్పెషల్ క్యారెక్టర్ అంటోంది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతున్న రాధ సినిమా డీటెయిల్స్ తో పాటు.. తన పర్సనల్, ప్రొఫెషనల్ ఎఫైర్స్ ను జీ సినిమాలు.కామ్ తో ఎక్స్ క్లూజివ్ గా షేర్ చేసుకుంది లావణ్య త్రిపాఠి.

సినిమాలో రాధ ఎవరు..?

ఇద్దరూ రాధలే. హీరో పేరు రాధ, నా పేరు కూడా రాధ. అయితే మేమిద్దరం ఎలా కలిశామన్నదే పాయింట్. ఇద్దరి పేర్లు ఒక్కటే అవ్వడం వెనక కూడా ఓ గమ్మత్తయిన ట్విస్ట్ ఉంది.

నేను కాలేజ్ స్టూడెంట్

రాధ సినిమాలో కాలేజ్ స్టూడెంట్ గా కనిపిస్తాను. ఇంతకు ముందు కూడా ఇలాంటి పాత్ర చేశాను. కానీ లుక్, క్యారెక్టర్ పరంగా ఇది కొంచెం స్పెషల్ గా ఉంటుంది. రాధ సినిమా పక్కా కమర్షియల్ మూవీ. ఈ సినిమాలో నాకు ఒక మాస్ సాంగ్, క్లాసికల్ సాంగ్ కూడా పడింది.

నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత

ఈ మూవీలో చాలా హ్యూమర్ ఉంది. అంతా సిచ్యువేషనల్  కామెడీ. సినిమాలో నన్ను 2 రకాలుగా చూస్తారు. సినిమాలో ఒక ట్విస్ట్ నాకు బాగా నచ్చింది. ఆ ట్విస్ట్ తో పాటు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కామెడీ ఉంది. అందుకే ఈ సినిమా ఒప్పుకున్నాను.

శర్వానంద్ అమాయకుడు

శర్వానంద్ తో వర్క్ చేయడం చాలా బాగుంది. అతడు ఎక్కువగా మాట్లాడడు. సెట్స్ లో నా గొంతే ఎక్కువగా వినిపిస్తుంది. తెరపై మాస్ గా కనిపించే శర్వ.. తెరవెనక మాత్రం చాలా మొహమాటస్తుడు, ఎవరితో పెద్దగా కలవడు.

నేను కూడా చాలా కామ్

ఇంట్లో నేను చాలా కామ్. బయట మాత్రం సరదాగా ఉంటాను. అందరు అమ్మాయిల్లానే పెరిగాను. కాలేజ్ కు డుమ్మా కొట్టడం అన్నీ కామన్. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాను.

ఆ సినిమా నన్ను నిరాశ పరచలేదు

“మిస్టర్” మూవీ నన్ను డిసప్పాయింట్ చేయలేదు. ప్రతి సినిమాకు కష్టపడినట్టుగానే దానికీ కష్టపడ్డాం. సినిమా రిజల్ట్ చూసి నేనేం బాధపడలేదు. నాతో పాటు అందరం చాలా కష్టపడ్డాం. ఆ సినిమాలో క్యారెక్టర్ అంటే నాకు చాలా ఇష్టం.

కొత్త దర్శకుడైనా సూపర్..

డైరక్టర్ చంద్రమోహన్ వర్క్ చాలా బాగుంది. కొత్త దర్శకుడైనా ఏం కావాలో అతడికి బాగా తెలుసు. ఈ సినిమాను అతడు ఇప్పటికే 10సార్లు తన మైండ్ లో చూసేశాడు. ప్రతి ఫ్రేం ఎలా ఉండాలో ముందే ఫిక్స్ అయి వస్తాడు. వెరీ టాలెంటెడ్.

ప్రతి సినిమా నాకు కొత్తే

నా దర్శకుడి దగ్గర ఎప్పుడూ స్టూడెంట్ లానే ఉంటా. చెప్పింది చెప్పినట్టు మాత్రమే చేస్తా. డౌట్స్ ఉంటే మాత్రం అడిగి తెలుసుకుంటా.. నేను ఎప్పుడూ క్రాస్ క్వశ్చన్స్ వేయను. నేను డైరక్టర్ ను అయినప్పుడు మాత్రమే క్వశ్చన్స్ వస్తాయి. నటిగా చెప్పింది చేయడమే నా పని.

సమ్మర్ వెకేషన్

ఈ వేసవికి వెకేషన్ లేదు. సెట్స్ పైనే ఉంటాను. ప్రస్తుతం నాగచైతన్య సినిమా చేస్తున్నాను.

తండ్రికొడుకుల మధ్య తేడా లేదు

నాగ్ తో చేశాను. ఇప్పుడు నాగచైతన్యతో చేయడం బాగా ఉంది. నిజానికి నాగ్ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని, తర్వాత చైతూ లేదా అఖిల్ తో చేయాలనుకున్నాను. కానీ వెంటనే ఛాన్స్ వచ్చింది. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారనే నమ్ముతున్నాను. తెలుగు ప్రజలు క్యారెక్టర్స్ మాత్రమే చూస్తారని నేను అనుకుంటున్నాను. అయినా నాగ్ కంటే ముందే మనం సినిమాలో చైతూతో చేశా.

అదే నా అందం

గ్లామర్ సీక్రెట్ అంటూ ఏమీ లేదు. నిజానికి అలాంటిది ఒకటి ఉందని నాకు తెలీదు. బహుశా కాన్ఫిడెంట్ గా, హ్యాపీగా ఉండడమే నా గ్లామర్ సీక్రెట్ అనుకుంటా. నా దృష్టిలో ఏ హీరోయిన్ అయినా తెరపై బాగా నటిస్తే గ్లామర్ గా ఉన్నట్టే లెక్క. ప్రేక్షకులు కూడా అదే చూస్తారు.  మనం సరిగ్గా పర్ఫార్మ్ చేయకపోతే, ఎంత గ్లామర్ మెయింటైన్ చేసినా వేస్ట్.

మంచి స్క్రిప్ట్ దొరికితే ఫ్రీ గా చేస్తా

ప్రస్తుతం కమర్షియల్ సినిమాలపైనే ఫోకస్ అంతా ఉంది. అలాంటి కథలే చేస్తున్నాను. భవిష్యత్తులో నా మనసుకు నచ్చిన మంచి కథ, స్క్రిప్ట్ వస్తే డబ్బులు తీసుకోకుండా ఫ్రీ గా చేస్తా.