నిఖిల్ సినిమాపై భారీ సస్పెన్స్ వీడింది...

Friday,May 18,2018 - 06:07 by Z_CLU

‘కిర్రాక్ పార్టీ’ తరవాత మరో భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ తో బిజీగా ఉన్నాడు నిఖిల్. అయితే నిన్నా మొన్నటి వరకు ఈ సినిమాలో నిఖిల్ సరసన నటించబోయే హీరోయిన్ ఎవరా అనే టాపిక్ చుట్టూ భారీ డిస్కర్షన్స్ జరిగాయి. అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలినీ పాండే ఆల్మోస్ట్ ఫిక్సయిందనే న్యూస్ కూడా గట్టిగానే చక్కర్లు కొట్టింది. అయితే ఈ సస్పెన్స్ ని బ్రేక్ చేస్తూ ఈ సినిమాలో హీరోయిన్ గా లావణ్య త్రిపాఠి ని ఫిక్స్ చేసుకుంది సినిమా యూనిట్.

తమిళ బ్లాక్ బస్టర్ ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. నిఖిల్ ని కంప్లీట్ గా డిఫెరెంట్ ఆంగిల్ లో ప్రెజెంట్ చేయనున్న ఈ సినిమా, నిఖిల్ కరియర్ లో స్పెషల్ మూవీ గా నిలిచిపోతుందంటున్నారు ఫిల్మ్ మేకర్స్.

 

శ్యామ్. సి. యస్. మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని కావ్య వేణుగోపాల్, రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. T.N. సంతోష్ డైరెక్టర్.