బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్న లావణ్య

Saturday,August 18,2018 - 11:34 by Z_CLU

గీతగోవిందం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవడమే కాకుండా.. హీరోయిన్ రష్మికకు కూడా మరపురాని విజయాన్నందించింది. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో బాధపడాల్సింది ఎవరైనా ఉన్నారంటే అది హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రమే.

అవును.. లావణ్య ఒప్పుకుంటే ఆమె కెరీర్ కు గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ యాడ్ అయి ఉండేది. కానీ కొద్దిలో ఈ బంగారంలాంటి ఛాన్స్ ను మిస్ చేసుకుంది లావణ్య. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు పరశురాం బయటపెట్టాడు.

“షూట్ కి వెళ్ళే ముందు గీత రోల్ కి కొంత మంది హీరోయిన్స్ ను అనుకున్నాం. ఒక 25 మందికి స్టోరీ కూడా వినిపించాను. కొత్త అమ్మాయిలను కూడా ఆడిషన్ చేసాం. చివరిగా లావణ్య త్రిపాఠిని ఫైనల్ చేసి ఫోటో షూట్ కూడా చేశాం. కానీ సరిగ్గా లావణ్య అప్పుడే ఓ తమిళ్ సినిమాకు సైన్ చేసింది. డేట్స్ కుదరకపోవడంతో ఆమె ప్లేస్ లోకి రష్మిక వచ్చింది.”

అలా లావణ్య ఈ సినిమాను మిస్ అయిన విషయాన్ని పరశురాం బయపెట్టాడు. సినిమాలో గీత క్యారెక్టర్ కు తాము అనుకున్నదానికంటే రష్మిక ఇంకా ఎక్కువే న్యాయం చేసిందంటున్నాడు పరశురాం.