లావణ్య త్రిపాఠి ఇంటర్వ్యూ

Monday,October 23,2017 - 02:46 by Z_CLU

ఎనర్జిటిక్ స్టార్ రామ్ ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ రిలీజ్ కి ముందే టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలో రామ్ సరసన లావణ్య త్రిపాఠి తో పాటు అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. ‘ఉన్నది ఒక్కటే జిందగీ’ ఈ నెల 27 న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సందర్భంగా లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో తన రోల్ కి సంబంధించి ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది. ఆ విషయాలు మీకోసం…

అందుకే  ఈ సినిమా అంత స్పెషల్

ఈ సినిమాలో నా క్యారెక్టర్ టూ మచ్ ఇంటెలిజెంట్ అని ఫీల్ అవుతూంటుంది. దానివల్ల స్టోరీలో న్యాచురల్ గానే ఫన్ జెనెరేట్ అవుతుంది. చాలా రియలిస్టిక్ గా, స్పెషల్ గా నా రియల్ క్యారెక్టర్ కి దగ్గరగా ఉంటుంది. అందుకే ఈ సినిమా నాకంత స్పెషల్.

 

అనుపమ విషయంలో అలాంటి ఫీలింగ్ లేదు…

అనుపమతో ఒకే సినిమాలో పనిచేయడం నాకేమీ కాంపిటీషన్ అనిపించడం లేదు. ‘శతమానం భవతి’ సినిమా చూసినప్పటి నుండి అనుపమ యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకే సినిమాకు ఒక టీమ్ లా పనిచేసినప్పుడు సినిమా సక్సెస్ అవ్వాలని ఉంటుంది కానీ, కాంపిటీషన్ ఉండదు.

చాలా ఫాస్ట్ గా ఎదగాలనుకుంటుంది…

నా క్యారెక్టర్ ఈ మూవీలో చాలా ఆంబీషియస్ గా ఉంటుంది. పేరు మ్యాగీ… లైఫ్ ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది. లిమిటెడ్ టైమ్ లో చాలా హైట్స్ కి రీచ్ అవ్వాలనుకుంటుంది. ఈ ప్రాసెస్ లో చాలా మిస్టేక్స్ చేస్తూంటుంది.

ఎంత ఇంపాక్ట్ ఇచ్చామన్నదే ఇంపార్టెంట్…

ఈ సినిమాలో నా క్యారెక్టర్ డ్యూరేషన్ చాలా తక్కువగా ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. కానీ రియాలిటీ తెలియాలంటే సినిమా చూస్తేనే అర్థమవుతుంది. అయినా సినిమాలో ఎంత సేపు కనిపించాం అనేదాని కన్నా కనిపించిన ఆ కాసేపట్లో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేశాం అనేదాన్నే నేను ఎక్కువగా నమ్ముతాను…

 

ఫిట్ నెస్ సీక్రెట్ అదే…

అవుట్ సైడ్ ఫుడ్ అంటే నాకు చాలా భయం. అయినా రెగ్యులర్ గా ఇంట్లో ఉండడం కుదరదు కాబట్టి ఏది పడితే అది తినేస్తుంటా… కాబట్టి మ్యాగ్జిమం వెయిట్ పెరిగే చాన్సెస్ ఉన్నాయి కాబట్టి చాలా వర్కవుట్ చేస్తుంటాను. నా ఫిట్ నెస్ కి రీజన్ కూడా వర్కవుటే.

ప్యాకేజీని బట్టి డెసిషన్ తీసుకుంటాను

ఫెమేల్ సెంట్రిక్ సినిమాలు చేయాలని ఉంది. కాకపోతే డెసిషన్ మాత్రం ప్యాకేజీ ని బట్టి తీసుకుంటాను. డైరెక్టర్, ప్రొడ్యూసర్, కథ.. ని బట్టే డెసిషన్ తీసుకుంటాను. ఇలా అన్ని కలిసొస్తే డెఫ్ఫినేట్ గా చేస్తాను…

లవ్ స్టోరీస్ నచ్చవు….

హారర్ సినిమాలంటే నాకు చాలా ఇష్టం. కానీ అలాంటి సినిమాలో నటించాలంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇక లవ్ స్టోరీస్ అస్సలు చూడను, కానీ అలాంటి సినిమాల్లో నటించడం అంటే చాలా ఇష్టం. నా టేస్ట్ కి సినిమాలకి సంబంధం ఉండదు..

ఫ్యూచర్ ప్లాన్స్…

ఫ్యూచర్ లో బిజినెస్ ప్లాన్స్ ఉన్నాయి. ఫిట్ నెస్, రెస్టారెంట్ అన్ని ఒకేచోట ఉండేలా ఏదైనా చేయాలని ప్లాన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడే కాదు.. ఇంకా టైమ్ పడుతుంది.